మంగారాణికి సావిత్రీభాయి ఫూలే పురస్కారం

ABN , First Publish Date - 2022-01-03T05:36:28+05:30 IST

రాజమహేంద్రవరంలోని నాగరాజా మునిసిపల్‌ ప్రాథమిక పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయిని మోటూరి మంగారాణి రాష్ట్ర స్థాయిలో సావిత్రీభాయి ఫూలే పురస్కారా నికి ఎంపికయ్యారు.

మంగారాణికి సావిత్రీభాయి ఫూలే పురస్కారం

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 2: రాజమహేంద్రవరంలోని నాగరాజా మునిసిపల్‌ ప్రాథమిక పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయిని మోటూరి మంగారాణి రాష్ట్ర స్థాయిలో సావిత్రీభాయి ఫూలే పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం సావిత్రి బాయిపూలే జయంతి సందర్భంగా గుంటూరులో జరిగే కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, కృష్ణ, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టి.కల్పలత చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని మంగారాణి అందుకోనున్నారు. టీచర్‌గా మంగారాణి చేస్తున్న కృషికి, విద్యాభివృద్ధికి ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా మంగారాణికి కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, అర్బన్‌ డీఐ దిలీప్‌కుమార్‌, డీవైఈవో దుర్గాప్రసాద్‌, స్కూల్‌ సూపర్‌వైజర్‌ అంబటి రాం బాబు, సూరిబాబు, వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు.

Read more