‘ముప్పు’తో ముసురు

ABN , First Publish Date - 2022-12-10T01:26:04+05:30 IST

మాండస్‌ తుఫాను ప్రభావం జిల్లాను వణికిస్తోంది. ఒకపక్క భారీఈదురుగాలులు, మరోపక్క వర్షాలు కురుస్తుండడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎక్కడికక్కడ ముసురు పట్టి ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగి జనం వణుకుతున్నారు. అటు తీరం శుక్రవారంనుంచి మరింత అల్లకల్లోలంగా మారింది

‘ముప్పు’తో ముసురు
ఉప్పాడ తీరంలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం

-మాండస్‌ తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

-శుక్రవారం రోజంతా ఈదురుగాలులతో కూడిన వానతో భయం భయం

-:అమాంతం పడిపోయిన ఉష్ణోగ్రతలతో ఒక్కసారిగా పెరిగిన చలితీవ్రత

-సముద్రంలో 50కి.మీ. వేగంతో భారీగాలులు వీస్తుండడంతో ఎగసిపడుతున్న కెరటాలు

-ఉప్పాడలో రోడ్డుపైకి రాకాసి అలలు: అటు మత్స్యకార గ్రామాల్లో గుబులు

-కరపలో ఈదురుగాలులకు తాటిచెట్టు కూలి మీదపడడంతో ద్విచక్రవాహనదారుడు మృతి

-మరోపక్క నేడు, రేపు పలుచోట్ల మోస్తరునుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదం

-సముద్రంలో భారీగాలులతో కాకినాడ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు బంద్‌

-నిలిచిపోయిన మూడు విదేశీ నౌకలు: రేపటివరకు ఎగుమతి, దిగుమతులపై ప్రభావం

-తుఫాను ముప్పుతో అన్నదాతల్లో కలవరం: 40శాతం పంటకు ఇంకా పూర్తికాని కోతలు

-ఆర్‌బీకేల్లో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లతో అన్నదాతల్లో ఆందోళన

మాండస్‌ తుఫాను ప్రభావం జిల్లాను వణికిస్తోంది. ఒకపక్క భారీఈదురుగాలులు, మరోపక్క వర్షాలు కురుస్తుండడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎక్కడికక్కడ ముసురు పట్టి ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగి జనం వణుకుతున్నారు. అటు తీరం శుక్రవారంనుంచి మరింత అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో కెరటాల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఉప్పాడలో సముద్రం మరింత భీకరంగా మారింది. పెద్దపెద్ద శబ్ధాలతో రాకాసి అలలు బీచ్‌రోడ్డును తాకుతున్నాయి.

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

తుఫాను శనివారం ఉదయంలోగా తీరం దాటనుండడంతో దాని ప్రభావంతో ఆదివారం వరకు జిల్లావ్యాప్తంగా ఓ మోస ్తరునుంచి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హె చ్చరించింది. తుఫాను ముప్పుతో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. ఆర్‌బీకే ల్లోను ధాన్యం కొనుగోళ్లు ఆగిపోయాయి. భారీ గాలులతో కర పలో ఓ తాటిచెట్టు నేలకూలింది. అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిపై పడడంతో అతడు మృత్యువాతపడ్డాడు.

నేడు..రేపు భారీ వర్షాలు..

మాండూస్‌ తుఫాను ప్రభావం తీరప్రాంత జిల్లాల్లో గుబు లు రేపుతోంది. గంటగంటకు ఈదురుగాలుల తీవ్ర తతోపాటు వర్షాలు పెరుగుతుండడం కలవరపరుస్తోంది. ముఖ్యంగా తు పాను తీరానికి సమీపించేకొద్దీ దీని ప్రభావం ఎక్కువవుతోంది. అందులోభాగంగా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామునుంచి ఈదురుగాలులు ఎక్కువయ్యాయి.ముఖ్యంగా తీరాన్ని ఆనుకు ని ఉన్న తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ, కరప, తాళ్ల రేవు మండలాల్లో ఉదయంనుంచీ గాలులు అధికంగా వీస్తు న్నాయి. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని జనం బెంబేలెత్తు తున్నారు. సాయంత్రం నుంచి జిల్లావ్యాప్తంగా వర్షాలు కూడా ఎక్కువయ్యాయి. ఒకపక్క గాలులు, మరోపక్క వర్షాలు ఏక ధాటిగా కురుస్తుండడంతో ఉష్ణోగ్రతలు సైతం 22 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ఒక్కసారిగా జిల్లాలో చలి పెరిగిపో యింది. జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సము ద్రంలో భారీగాలుల తీవ్రత శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా పెరిగిపోయింది. 45నుంచి 50 కిలోమీటర్ల వేగం తో గాలులు వీయడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో తీరప్రాంత మండలాల్లో ఎక్కడికక్కడ కెరటాలు ఉవ్వె త్తున ఎగసిపడుతున్నాయి.

కెరటాల ధాటికి...

ఉప్పాడలో సముద్రం మరింత ప్రమాదకరకంగా మారింది. పెద్దపెద్ద కెరటాలు ఎగిరిపడుతూ రోజంతా బీచ్‌ రోడ్డును తాకుతూనే ఉన్నాయి. రెండుచోట్ల వంతెనల కిందనుంచి కెర టాలు రోడ్డుకు అవతలవైపు దూసుకువెళ్లాయి. మొన్నటి తు ఫానుకు రాకాసి అలల కారణంగా ఇళ్లు కూలిపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్లు ఏమవుతాయోనని అక్కడున్న మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రంలో గాలు లు అధికంగా ఉండడం, అలల ఉధృతి ప్రమా దకరంగా ఉండడంతో కాకినాడ యాంకరేజ్‌ పోర్టునుంచి శుక్రవారం విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. తీరంనుంచి బార్జీలు బియ్యాన్ని తీసుకువెళ్లడానికి సాహ సించలేకపోయాయి. దీంతో లోడింగ్‌ జరగక మూడు విదేశీ నౌకలు సముద్రంలో లంగరు వేశాయి. మరోపక్క వందలాది బోట్లు సము ద్రంలో వేటను ఆపేసి పోర్టుకు వచ్చి లంగరు వేశాయి. కాగా మాండస్‌ తుపాను శనివారం ఉదయంలోగా తీరం దాట నుంది. ఈ ప్రభావంతో వర్షాల తీవ్రత శనివారం నుంచి పెరగనుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆదివారం వరకు జిల్లాలో అక్కడకక్కడ ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఏం చేయాలో..

జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 90,900 హెక్టార్లలో వరిసాగైంది. ఈపంటలో ప్రస్తు తం 60శాతం వరకు కోతలు పూర్తవగా ఇంకా 40శాతం కోయాల్సి ఉంది. కానీ తు ఫాన్‌ ముప్పు పొంచి ఉండడంతో వందలా దిమంది అన్నదాతలు ఆందోళనకు గురవు తున్నారు. ఈదురుగాలులు, వర్షాలతో పంట నేలకొరిగి పో తుందని దిగులు చెందుతున్నారు. ఇదే జరిగితే పంట ముని గిపోవడం లేదా కంకులు నేలరాలి ధాన్యం నీటిపాలవుతుం దని బెంగపడుతున్నారు. ఆదివారం వరకు వర్షాల ముప్పు ఉండడంతో అప్పటివరకు పంటను కాపాడుకోవడం ఎలా గోనని ఆందోళన చెందుతున్నారు. వర్షాల భయంతో ప్రస్తుతం రైతులెవరు పంటలు కోయవద్దని జిల్లా వ్యవసాయశాఖ అన్నదాతలకు విజ్ఞప్తి చేసింది. తుపాను ముప్పు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా హమాలీలు రాక ధాన్యం అన్‌లోడింగ్‌ జరగడం లేదు. దీంతో ఆర్‌బీకేలు వెలవెలబోతున్నాయి.

Updated Date - 2022-12-10T01:26:07+05:30 IST