అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-03T06:13:04+05:30 IST

అప్పుల బాధ తాళలేక పర్లోవపేటలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్లోవపేట రాజీవ్‌ గృహకల్ప అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పినపోతు మణికుమార్‌కు(33) భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

కాకినాడ క్రైం, జనవరి 2: అప్పుల బాధ తాళలేక పర్లోవపేటలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్లోవపేట రాజీవ్‌ గృహకల్ప అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పినపోతు మణికుమార్‌కు(33) భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. పోర్టులో కూలి పనికి వెళుతూ జీవనం సాగించేవాడు. మద్యం అలవాటు ఉండడంతో పాటు అప్పులు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి పక్కగదిలో పడుకున్నాడు. మరో గదిలో నిద్రిస్తున్న భార్య, పిల్లలు ఉదయం లేచి చూసేసరికి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని వేళాడుతూ కనిపించాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. కాకినాడ పోర్టు సీఐ రామ్మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఐ రాజేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Read more