ఆమెను కలిస్తే.. పనైపోద్ది!

ABN , First Publish Date - 2022-06-12T06:04:33+05:30 IST

ఆ నియోజకవర్గంలో ఆమె చెప్పిందే వేదం..అనుకుంటే జరిగిపోతుంది ..అది ఎంత పెద్ద పనైనా.. నిబం ధనలకు విరుద్ధమైనా అడ్డే ఉం డదు.

ఆమెను కలిస్తే.. పనైపోద్ది!

నిడదవోలులో సరికొత్త రాజకీయం

సొమ్ములిస్తే నిబంఽధనల ఊసేలేదు

ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకు అడ్డేలేదు

నియోజకవర్గంలో హాట్‌ టాఫిక్‌గా ఆమె..


నిడదవోలు, జూన్‌ 11 : ఆ నియోజకవర్గంలో ఆమె చెప్పిందే వేదం..అనుకుంటే జరిగిపోతుంది ..అది ఎంత పెద్ద పనైనా.. నిబం ధనలకు విరుద్ధమైనా అడ్డే ఉం డదు.అధికారులతో పనే ఉండదు.. అమ్మగారికి ఎంతో కొంత ముట్ట చెబితే మీ పని ఖాయం.. ఇటీవలే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా ఒక ప్రజాప్రతినిధి అండతో చక్రం తిప్పుతోంది. అందరినీ తన వైపు తిప్పుకుంటుంది.ఎందుకంటే ఆమె చూపులు కొత్తగా ఉంటాయి.. మాటలు ప్రియంగా ఉంటాయి. ఆ యువ మహిళా నేత ముందు సీనియర్స్‌ అయినా సాటిరారు. కొత్తగా ఏడాదిన్నర క్రితమే అరం గేట్రం చేసినా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అందరూ చేతులెత్తేసిన పని సైతం ఆమె చేసుకొచ్చి ఆశ్చర్యంలో ముంచేస్తోంది. జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో ప్రస్తుతం ఆ యువ మహిళా నేత గాలికి ఎదురే లేకుండాపోయింది. అనుమ తుల్లేని పనైనా ఆమె తలచుకుంటే క్షణంలో అనధికారికంగా ప్రభుత్వ కార్యాల యాల్లో అనుమతులు మంజూరైపోతున్నాయి. గతంలో పోలీస్‌ శాఖలో ఎన్నో పనులను చేయించిన ఘనత ఆమెది. ఒక్క ఫోన్‌ కొడితే చాలు ఎంత పెద్ద కేసు అయినా ఆగిపోవాల్సిందే.. అటువంటిది ప్రస్తుతం ఆమె గాలి నిడదవోలు పట్టణంపై పడింది. ఇటీవల మునిసిపల్‌ కార్యాలయంలో అనుమతులు రాని నిర్మాణానికి సంబంధించి ఆమె డబ్బు తీసుకుని పని చేయించిందని ఆ పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. ఇదిలా ఉంటే ఆమె వాడే వాహనానికి అనధికారికంగా పోలీస్‌ సైరన్‌ లాంటి హారన్‌ ఉపయోగిస్తోంది.అయినా కనీసం ప్రశ్నించే వారే లేరు. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలే ఆమె ధాటికి ఎదురు నిలవలేక పక్కకు తప్పుకుంటున్న వైనం..ఇలా ఎన్నో ఎన్నెన్నో. ప్రస్తుతం నిడ దవోలు పట్టణంలోని ప్రజలందరి చూపు ఆ మహిళా యువ నేత వైపే.


Read more