లారీ ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-03-16T06:16:57+05:30 IST

అనపర్తిలోని ఐఎల్‌టీడీ జంక్షన్‌ వద్ద కెనాల్‌ రోడ్డుపై మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు అందించిన వివరాల ప్రకారం..

లారీ ఢీకొని వ్యక్తి మృతి

అనపర్తి, మార్చి 15: అనపర్తిలోని ఐఎల్‌టీడీ జంక్షన్‌ వద్ద కెనాల్‌ రోడ్డుపై మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు అందించిన వివరాల ప్రకారం.. అనపర్తికి చెందిన వరసాల రాంబాబు(55) స్కూటీపై దేవిచౌక్‌ వైపు వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న లారీ స్కూటీని ఢీకొట్టింది. రాంబాబు తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహానికి అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్టు ఆయన తెలిపారు.

Read more