లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలో ఉమ్మడి జిల్లాకు ద్వితీయస్థానం

ABN , First Publish Date - 2022-08-15T06:27:25+05:30 IST

జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 18,667 కేసులు పరిష్కరించి రాష్ట్రంలోనే ద్వితీయస్థానం సాధించినట్లు ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు.లోక్‌ అదాలత్‌లో కాకినాడ జిల్లాలో 8752 కేసులు పరిష్కారమయ్యాయన్నారు.

లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలో ఉమ్మడి జిల్లాకు ద్వితీయస్థానం

 కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు 

కాకినాడ క్రైం, ఆగస్టు 14: జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 18,667 కేసులు పరిష్కరించి రాష్ట్రంలోనే ద్వితీయస్థానం సాధించినట్లు ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు.లోక్‌ అదాలత్‌లో కాకినాడ జిల్లాలో 8752 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. జిల్లాలో 637 ఐపీసీ కేసులు, 118 స్పెషల్‌ యాక్ట్‌ కేసులు, 7997 పెట్టి కేసులు వెరసి 8752 కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 18,667 కేసులు పరిష్కారమై రాష్ట్రంలోనే ద్వితీయస్థానం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఇది అందరి  కష్టమని తెలి పారు. కేసుల పరిష్కారంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 

Read more