స్తంభంపై నుంచి పడి లైన్‌మన్‌ మృతి

ABN , First Publish Date - 2022-02-23T06:27:57+05:30 IST

రాజమహేంద్రవరం సంజీవయ్య నగర్‌లో విద్యుత్‌ స్తంభంపై మరమ్మతులు చేసి దిగుతుండగా నిచ్చెన జారి కింద పడి లైన్‌మెన్‌ మృతిచెందాడు త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.

స్తంభంపై నుంచి పడి లైన్‌మన్‌ మృతి

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 22: రాజమహేంద్రవరం సంజీవయ్య నగర్‌లో విద్యుత్‌ స్తంభంపై మరమ్మతులు చేసి దిగుతుండగా నిచ్చెన జారి కింద పడి లైన్‌మెన్‌ మృతిచెందాడు త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం పిడింగొయ్యి గ్రామానికి చెందిన బి.రాజమోహన్‌(40) విద్యుత్‌ శాఖలో లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. సంజీవయ్యనగర్‌లో లైన్‌ రిపేరు చేసేందుకు స్తంభం ఎక్కిన అతను పని ముగించుకుని దిగుతుండగా కిందపడడంతో తలకు తీవ్రగాయమైంది. వెంటనే సహచర సిబ్బంది అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. రాజమోహన్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. ఏఈ ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more