మద్యం మత్తులో ఏర్పడిన తగాదాతోనే స్నేహితుడి హత్య

ABN , First Publish Date - 2022-06-12T07:02:13+05:30 IST

వారిద్దరిదీ ఒకే గ్రామం, చిననాటి స్నేహితులు. మద్యం పార్టీల్లో సరదాగా మాటలతో ప్రారంభమైన దూషణలు ఘర్షణకు దారితీశాయి. మద్యం పార్టీలో ఇతర స్నేహితుల ఎదుట తిట్టి చెంపపై కొట్టడాన్ని జీర్ణించుకోలేక చిన్ననాటి స్నేహితుడు పాలెపు కాసుబాబును అతి కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ వివరాలను సీఐ పి.రామచంద్రరావు విలేకరులకు శనివారం వెల్లడించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి చెందిన పాలెపు కాసుబాబు, నిందితుడు మల్లాడి రవికాసు(రవి) ఇద్దరూ స్నేహితులు. కొన్నేళ్ల కిందట వీరిద్దరూ కాకినాడ జగన్నాథపురం కోటి స్తంభాలపేటలో గది అద్దెకు తీసుకుని తమ గ్రామానికే చెందిన విగ్నేశ్వరుడు(విగ్నేష్‌), రామకృష్ణలతో ఒకే గదిలో నివాసం ఉండేవారు. ఐదు నెలల కిందట విగ్నేష్‌, రామకృష్ణ ఇద్దరూ కలసి కాకినాడ శాంతినగర్‌లో ఫొటో స్టూడియో ఏర్పాటుచేశారు. ఇందులో మల్లాడి రవికాసును నెలకు రూ.18వేల జీతంతో ఫొటో ఆల్బం డిజైనర్‌గా పెట్టుకున్నారు. నలుగురు స్నేహితులు కలసి ప్రతి ఆదివారం రాత్రి మద్యం పార్టీ చేసుకోవడం అలవాటు. ఈ క్రమంలో కొన్నిసార్లు మద్యం పార్టీలో మృతుడు పాలెపు కాసుబాబుకు నిందితుడు మల్లాడి

మద్యం మత్తులో ఏర్పడిన తగాదాతోనే  స్నేహితుడి హత్య

 నిందితుడిని  అరెస్ట్‌ చేసిన పోలీసులు

కాకినాడ క్రైం, జూన్‌ 11: వారిద్దరిదీ ఒకే గ్రామం, చిననాటి స్నేహితులు. మద్యం పార్టీల్లో సరదాగా మాటలతో ప్రారంభమైన దూషణలు ఘర్షణకు దారితీశాయి. మద్యం పార్టీలో ఇతర స్నేహితుల ఎదుట తిట్టి చెంపపై కొట్టడాన్ని జీర్ణించుకోలేక చిన్ననాటి స్నేహితుడు పాలెపు కాసుబాబును అతి కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ వివరాలను సీఐ పి.రామచంద్రరావు విలేకరులకు శనివారం వెల్లడించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి చెందిన పాలెపు కాసుబాబు, నిందితుడు మల్లాడి రవికాసు(రవి) ఇద్దరూ స్నేహితులు. కొన్నేళ్ల కిందట వీరిద్దరూ కాకినాడ జగన్నాథపురం కోటి స్తంభాలపేటలో గది అద్దెకు తీసుకుని తమ గ్రామానికే చెందిన విగ్నేశ్వరుడు(విగ్నేష్‌), రామకృష్ణలతో ఒకే గదిలో నివాసం ఉండేవారు. ఐదు నెలల కిందట విగ్నేష్‌, రామకృష్ణ ఇద్దరూ కలసి కాకినాడ శాంతినగర్‌లో ఫొటో స్టూడియో ఏర్పాటుచేశారు. ఇందులో మల్లాడి రవికాసును నెలకు రూ.18వేల జీతంతో ఫొటో ఆల్బం డిజైనర్‌గా పెట్టుకున్నారు. నలుగురు స్నేహితులు కలసి ప్రతి ఆదివారం రాత్రి మద్యం పార్టీ చేసుకోవడం అలవాటు. ఈ క్రమంలో కొన్నిసార్లు మద్యం పార్టీలో మృతుడు పాలెపు కాసుబాబుకు నిందితుడు మల్లాడి రవికాసుల మధ్య మాటలతో తిట్టుకోవడం, కొన్ని సందర్భాల్లో కొట్టుకోవడం జరిగేది. దీంతో మృతుడు కాసుబాబుపై కక్షపెట్టుకుని ఏదోలా అంతం చేయాలని నిందితుడు రవికాసు నిర్ణయించుకున్నాడు. ఎప్పటిలాగేనే ఈనెల 8వతేదీ రాత్రి విగ్నేష్‌ అద్దెకు తీసుకున్న ఎస్‌ఆర్‌ గ్రాండ్‌ హోటల్లో రూం నెంబరు 306లో మద్యం పార్టీ పెట్టుకుని మద్యం తాగారు. పార్టీ మధ్యలో మృతుడు పాత గొడవల నేపథ్యంలో స్నేహితుల మధ్య తిట్టడంతో వారించబోయి అడగ్గా నిందితుడైన రవికాసును చెంపపై కొట్టడంతో తగాదాను వారించారు. దీంతో కాసుబాబుపై పగపెంచుకున్న రవికాసు లాడ్డి రూమ్‌నుంచి బయటకు వెళ్లిపోయాడు. 9వ తేదీ తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో మృతుడితో మళ్లీ తగదా పడి రెచ్చగొట్టేలా ప్రవర్తించి ఖాళీ బీరుసీసాలతో దాడికి పాల్పడ్డాడు. మృతుడు ప్రతిఘటించడంతో అక్కడున్న వోడ్కా బాటిల్‌ తీసుకుని మృతుడు కాసుబాబు కంఠంపై బలంగా పలుసార్లు పొడిచి హత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. స్నేహితుల ము ందు కొట్టినందుకు ప్రతీకారంగానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. మృతుని అన్నయ్య ధనవర్మ ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్‌డీపీవో పర్యవేక్షణలో సిబ్బందితో కలసి నిందితుడు రవికాసును శుక్రవారం రాత్రి భానుగుడి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలోని ఘాటిలమ్మ ఆలయంవద్ద అరెస్ట్‌ చేశామన్నారు. హత్యకు ఉపయోగించిన గాజుసీసా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌బైక్‌ని స్వాధీనం చేసుకున్నామన్నారు. రెండో అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధిస్తామన్నారు.Read more