సాహితీవక్తలు యువతకు స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-12-12T00:55:59+05:30 IST

స్వాతంత్య్ర ఉద్యమం లో ప్రాణాలర్పించిన ఎందరో మహానుభావులు, సాహితీవక్తల జీవితాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు అన్నారు. ఆ

సాహితీవక్తలు యువతకు స్ఫూర్తి

స్వాతంత్య్ర స్ఫూర్తి-సాహిత్య దీప్తి రాష్ట్రస్థాయి సదస్సు

కొవ్వూరు, డిసెంబరు 11: స్వాతంత్య్ర ఉద్యమం లో ప్రాణాలర్పించిన ఎందరో మహానుభావులు, సాహితీవక్తల జీవితాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు అన్నారు. ఆజా దికా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా సంస్కార భారతి ఆధ్వర్యంలో ఆదివారం కొవ్వూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠంలోని వేదసంస్కృత కళాశాలలో స్వాతంత్య్ర స్ఫూర్తి-సాహిత్య దీప్తి రాష్ట్రస్థాయి ప్రసంగ సదస్సు నిర్వహించారు. సంస్కార భారతి రాష్ట్ర కార్యాధ్యక్షుడు టీఎన్‌వీ రమణమూర్తి అధ్యక్షతన జరిగిన చర్చావేదికలో రాష్ట్రంలోని వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన ప్రముఖులు తెలుగు సాహిత్యంపై-జాతీయోద్యమ ప్రభావం అనే అంశంపై చర్చ కొనసాగించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో తెలుగు సాహిత్యంతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపిన సాహితీవేత్తల సేవలను కొనియాడారు. సంస్కార సాహితీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భావన రత్నకుమారి మాట్లాడుతూ సంస్కార భారతి నిర్వహిస్తున్న చర్చావేదికలు మరుగున పడుతున్న సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు, పిల్లలలో దేశభక్తిని నింపడం అభి నందనీయమన్నారు. భారతీయ సంస్కతి సాంప్రదాయాలు, తెలుగు సాహిత్యం కారణంగానే ప్రపంచమంతా దేశం వైపు చూస్తున్నాయన్నారు. ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ సమాజంలో జాతి అణచివేతకు గురవుతున్న సమయంలో ప్రజల వ్యతిరేకత ఉద్యమం రూపంలో బయటకు వస్తోం దని, అటువంటి ఉద్యమాలకు, కవులు తమ సాహిత్యంతో ఆగ్రహజ్వాలలను సమాజంలో వ్యాప్తి చేస్తారన్నారు. వందేమాతర గీతం ద్వారా భారతమాతను శక్తి స్వరూపంగా వర్ణించిన సాహిత్యం అన్నివర్గాల ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపిందన్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్యమం స్వరూపం మారిపోయిందన్నారు. అటువంటి స్ఫూర్తిని నేటి యువతలో నింపడానికి సంస్కారభారతి నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం తెలుగు సాహిత్యంపై-జాతీయోద్యమ ప్రభావం అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో 25ఏళ్లలోపు విభాగంలో ప్రథ మ బహుమతి పి.వినోధకుమార్‌(కడప), ద్వితీయ బహుమతి జె.అబిరామ్‌(కడప), తృతీయ బహుమతి కె.హర్షవర్ధన్‌(కేఎల్‌ యూనివర్శిటీ) 25 ఏళ్లు పైబడిన విభాగంలో ఆకుల రఘురామయ్య (అనంతపురం), కోరాడ దుర్గారావు (శ్రీకాళహస్తి), ఎస్‌ఆర్‌ పృధ్వి (రాజమహేంద్రవరం) ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ముఖ్యఅతిథులు అందజేశారు. కార్యక్రమంలో హిందూనగారా జాతీయ పత్రిక పబ్లిషర్‌ తులసి సూర్యప్రకాష్‌, దక్షిణమధ్య క్షేత్రప్రముఖ్‌ వేదనభట్ల శేఖర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వర్రే మురళీకృష్ణ, అచార్య దోర్భల ప్రభాకరశర్మ, కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ, గోవర్దనం శ్రీనివాసమూర్తి, సంస్కారభారతి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:56:01+05:30 IST