వృథా వెలుగులు

ABN , First Publish Date - 2022-05-18T06:54:34+05:30 IST

ఎల్‌ఈడీ వీధిలైట్లు పగటిపూట వెలుగు తూ విద్యుత్‌ వృథాకు కారణమవుతున్నాయి. వీటి నిర్వహ ణ పంచాయతీలకు వదిలిపెట్టారు కానీ వాటి ఆపరేటింగ్‌ ను అమరావతి నుంచే చేస్తున్నారు.

వృథా వెలుగులు
కరపలో సూర్యుడు ఉండగానే వెలుగుతున్న ఎల్‌ఈడీ వీధిలైటు

  • పంచాయతీల్లో అదనంగా ఎల్‌ఈడీ లైట్ల వెలుగు 
  • అమరావతిలోనే టైమర్‌.. వృథా అవుతున్న విద్యుత్‌ 
  • పంచాయతీలకు భారంగా కరెంటు బిల్లులు

కరప, మే 17: ఎల్‌ఈడీ వీధిలైట్లు పగటిపూట వెలుగు తూ విద్యుత్‌ వృథాకు కారణమవుతున్నాయి. వీటి నిర్వహ ణ పంచాయతీలకు వదిలిపెట్టారు కానీ వాటి ఆపరేటింగ్‌ ను అమరావతి నుంచే చేస్తున్నారు. కాలాలకు అనుగుణంగా ఎల్‌ఈడీ వీధిలైట్లు నిర్ధేశిత సమయాల్లో వెలిగి ఆరిపోయేలా టైమర్‌ను సెట్‌ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పనిచేయిస్తారు. చలికాలం పగటి సమయం తక్కువ.. రాత్రి స మయం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో సాయంత్రం 5:30గంటలకే ఎల్‌ఈడీ లైటు వెలిగి ఉదయం 6గంటలకు ఆరి పోయేలా టైమర్‌ను సెట్‌ చేశారు. ఇప్పుడు వేసవిలో పగటి సమయం ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉం టుంది. దీంతో సాయంత్రం 6:30గంటలకుగానీ చీకటి పడడంలేదు. ఉదయం 5గంటలకే తెల్లారిపోతోంది. ఎల్‌ఈడీ సిస్టమ్‌లో టైమర్‌ను మార్చకపోవడంతో సూర్యుడు ఉండ గానే సాయంత్రం ఒక గంట, సూర్యుడు ఉదయించి వెలుగు వచ్చినా ఉదయం మరో గంట... ఇలా రెండు గంటలు వృథాగా లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది వీధిలైట్లు వెలుగులతో భారీస్థాయిలో వృథాగా విద్యుత్‌ వినియోగమవుతోంది. ఆ విద్యుత్‌ భారం పంచాయతీలపై పడి కరెంట్‌ బిల్లులు కట్టలేని దుస్థితికి దారితీ స్తోంది. ఈ వీధిలైట్ల ఆపరేటింగ్‌ పంచాయతీల చేతుల్లో లేకపోవడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. ఎల్‌ఈడీ లైట్ల టైమర్‌ను మార్చాలని ఇటీవల పైకి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని కరప మాజీ సర్పంచ్‌ పోలిశెట్టి తాతీలు తనగోడును వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఎల్‌ఈడీ వీధిలైట్లు వెలిగే సమయాలను మార్చాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-05-18T06:54:34+05:30 IST