పిఠాపురంలో న్యాయవాదిపై దాడి..గాయాలు

ABN , First Publish Date - 2022-03-23T06:06:34+05:30 IST

పిఠాపురంలో న్యాయవాదిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి గాయపరిచిన సంఘటన సంచలనంగా మారింది. తన కార్యాలయంలో పని ముగించుకుని సోమవారం రాత్రి మోటార్‌సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న సీనియర్‌ న్యాయవాది బాదం ఈశ్వరబాబు ఆర్టీసీ కాంప్లెక్సు పక్కవీధిలోకి వచ్చేసరికి గుర్తుతెలియని ఆరుగురు మోటార్‌సైకిళ్లపై వచ్చి అడ్డంగా నిలిపారు.

పిఠాపురంలో న్యాయవాదిపై దాడి..గాయాలు
పిఠాపురంలో జరిగిన దాడిలో గాయపడిన న్యాయవాది బాదం ఈశ్వరబాబు

పిఠాపురం, మార్చి 22: పిఠాపురంలో న్యాయవాదిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి గాయపరిచిన సంఘటన సంచలనంగా మారింది. తన కార్యాలయంలో పని ముగించుకుని సోమవారం రాత్రి మోటార్‌సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న సీనియర్‌ న్యాయవాది బాదం ఈశ్వరబాబు ఆర్టీసీ కాంప్లెక్సు పక్కవీధిలోకి వచ్చేసరికి గుర్తుతెలియని ఆరుగురు మోటార్‌సైకిళ్లపై వచ్చి అడ్డంగా నిలిపారు. ఏం మాట్లాడకుండానే ఇనుపరాడ్లు, క్రికెట్‌బ్యాట్లతో విచక్షణా రహితంగా దాడి చేసి కొట్టడంతో ప్రాణభయంతో పారిపోయినట్టు ఈశ్వరబాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఈశ్వరబాబు పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, పట్టణ ఎస్‌ఐ శంకరరావు సంఘటనపై ఆరా తీశారు.
న్యాయవాదుల విధుల బహిష్కరణ
సీనియర్‌ న్యాయవాది ఈశ్వరబాబుపై దాడికి నిరసనగా పిఠాపురంలోని కోర్టుల్లో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. కోర్టుల బయట ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. సీఐ వైఆర్‌కేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రాజారావు, కేఎ్‌సఆర్‌ భాస్కర్‌, ఉపాధ్యక్షుడు బంగారు రామకృష్ణ, ముమ్మిడి రామకృష్ణ, సురేష్‌, రాజగోపాల్‌, శాస్త్రి, కామిశెట్టి సత్యవేణి పాల్గొన్నారు.

Updated Date - 2022-03-23T06:06:34+05:30 IST