న్యాయసేవలపై అవగాహన

ABN , First Publish Date - 2022-09-24T06:44:56+05:30 IST

అరెస్ట్‌, రిమాండ్‌ దశల్లో న్యాయసేవలపై పోలీసులకు జిలా న్యాయసేవాధికార సంస్థ అవగాహన కల్పించింది. రాజమహేద్రవరం డీఎల్‌ఎస్‌లో శుక్రవారం పోలీసులతో కలిసి నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.ప్రత్యూషకుమారి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

న్యాయసేవలపై అవగాహన

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 23: అరెస్ట్‌, రిమాండ్‌ దశల్లో న్యాయసేవలపై పోలీసులకు జిలా న్యాయసేవాధికార సంస్థ అవగాహన కల్పించింది. రాజమహేద్రవరం డీఎల్‌ఎస్‌లో శుక్రవారం పోలీసులతో కలిసి నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.ప్రత్యూషకుమారి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. అరెస్ట్‌ చేసినప్పుడు నిందితులు న్యాయవాదిని కలిగి ఉండడం, వారితో సంప్రదించడం ప్రాధమిక హక్కు. ఆర్థిక పరిస్థితి వల్ల ఎవరికైనా న్యాయవాదిని కలిగి ఉండకపోతే పోలీసు వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థకు కాని మండల న్యాయసేవా కమిటీలకు గాని తెలియజేస్తే వారికి ఉచిత న్యాయవాదిని నియమిస్తాయని తెలిపారు. సుప్రీం కోర్టు సూచనలతోపాటు క్రిమినల్‌ రూల్స్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ సెక్షన్‌ 41,41ఎ నల్సా ఇచ్చిన సూచనలను వివరించారు. సదస్సులో ఏఎస్పీ జీ వెంకటేశ్వరరావు, కొవ్వూరు డీఎస్పీ బి.త్రినాథ్‌, ఎస్‌ఐ మహమ్మద్‌, ఎంఆర్‌ ఆలీఖాన్‌, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెక్రటరీ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T06:44:56+05:30 IST