లైంగిక వేధింపుల కేసు నమోదు

ABN , First Publish Date - 2022-05-30T06:44:57+05:30 IST

రామచంద్రపురం మండలం వేగాయమ్మపేటలో ఒక వివాహితను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేశారు.

లైంగిక వేధింపుల  కేసు నమోదు

ద్రాక్షారామ, మే 29: రామచంద్రపురం మండలం వేగాయమ్మపేటలో ఒక వివాహితను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేశారు. వేగాయమ్మపేటకు చెందిన దారా దుర్గాదేవి, దారా నానిబాబు దంపతులు దుర్గాదేవి తల్లి ఇంట్లో ఒక పోర్షన్‌లో నివా సం ఉంటున్నారు. భర్త, తల్లి ఇంట్లోలేని సమయంలో దుర్గాదేవిని పక్క ఇంట్లో ఉంటున్న దుర్గాదేవి మేనమామ కుమారుడు బొమ్ము దుర్గారావు కోరిక తీర్చాలని లైంగికంగా వేధిస్తున్నాడు.  బొమ్ము దుర్గారావు తల్లిదండ్రులు బొమ్ము ప్రకాశరావు, బొమ్ము లక్ష్మిలకు ఈవిషయాన్ని దుర్గాదేవి తల్లి తెలపగా ఈవిషయం ఎవ్వరికి చెప్పవద్దని మందలిస్తామని తెలిపారు. తరువాత కొన్ని రోజుల నుంచి దుర్గారావు వేధింపులు మళ్లీ మొదలు పెట్టాడు. దుర్గాదేవి పర్సనల్‌ ఫోటోస్‌ ఉన్నాయని, ఆమె భర్తకు చూపిస్తానని బెదిరింపులకు దిగాడు. మళ్లీ అతని తల్లి దండ్రులకు తెలుపగా వారు దుర్గాదేవిని దూషించారు. దీనిపై దిశ కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేయగా వారి సూచన మేరకు ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేసింది.   పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. Read more