-
-
Home » Andhra Pradesh » East Godavari » labour agitation-NGTS-AndhraPradesh
-
కడియం పేపరు మిల్లు కార్మికుల నిరసన
ABN , First Publish Date - 2022-09-08T06:30:35+05:30 IST
వేతన ఒప్పందం విషయంలో తమకు న్యాయం చేయాలంటూ కడియం పేపరుమిల్లు కార్మికులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

వేతన ఒప్పందంలో న్యాయం చేయాలని డిమాండ్
కడియం, సెప్టెంబరు 7: వేతన ఒప్పందం విషయంలో తమకు న్యాయం చేయాలంటూ కడియం పేపరుమిల్లు కార్మికులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మిషన్లు ఆపివేసి ఉత్పత్తిని నిలిపివేసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపారు. పలువురు కార్మికులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన వేతన ఒప్పందం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేపరుమిల్లు కార్మికులు తమకు అగ్రిమెంట్ చేయాలంటూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తమకు న్యాయం చేయాలంటూ ప్రజాప్రతినిధులను, అధికారులను కార్మికసంఘ నాయకులు కలిసి వారి దృష్టికి సమస్యను తీసుకెళ్ళారు. పేపరుమిల్లు వద్ద కార్మికులు, యాజమాన్యానికి మధ్య ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ తిలక్ నేతృత్వంలో పోలీసు సిబ్బందిని ఉంచారు.