కిరాణా షాపులలో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2022-03-23T06:15:10+05:30 IST

జిల్లాలోని పలు కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్సు, గానుక ఇండస్ర్తీలు, ఇతర దుకాణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోన్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి, పలు అక్రమాలు గుర్తించి 25 కేసులు నమోదు చేశారు.

కిరాణా షాపులలో విజిలెన్స్‌ తనిఖీలు

 25 కేసులు నమోదు

 శివప్రసాద్‌ గానుగ ఇండస్త్రీలోనూ తనిఖీలు

 పలు అక్రమాలు గుర్తింపు 

రాజమహేంద్రవరం, మార్చి 22(ఆంధ్రజ్యోతి) :  జిల్లాలోని పలు కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్సు, గానుక ఇండస్ర్తీలు, ఇతర దుకాణాలపై  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోన్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి, పలు అక్రమాలు గుర్తించి 25 కేసులు నమోదు చేశారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు వంటనూనెలు, ఇతర సరుకులు అమ్మడం, ప్యాకె ట్లపై వివరాలు ఏమీ లేకపోవడం గుర్తించి కేసులు నమోదు చేశారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ ఉప్పాడ రవిప్రకాష్‌ కథనం ప్రకారం మంగళవారం రాజమహేంద్రవరంలోని వీరభద్ర కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, శ్రీరాఘవేంద్ర జనరల్‌ స్టోర్స్‌, బాలకిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ తనిఖీ చేసి పలు అక్రమాలు గుర్తించారు. నువ్వులనూనె ప్యాకెట్లు, మూంగుడాల్‌ ప్యాకెట్లపై మాండేటరీ డిక్లరేషన్‌ లేకపోవడం, ఫ్రీడం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను  ఎమ్మా ర్పీ 175 ఉండగా, 200లకు విక్రయించడం గుర్తించి కేసులు నమోదు చేశారు. శివప్రసాద్‌ గానుక ఇం డస్ర్టీని తనిఖీ చేసి నువ్వుల నూనెల ప్యాకెట్లపై మాండేటరీ డిక్లరేషన్‌ లేకపోవడంతో కేసు నమో దు చేశారు. ఇంకా  శ్రీ సాయి కిరాణా అండ్‌ జనర ల్‌ స్టోర్స్‌లో కూడా తనిఖీలు నిర్వహించారు. రాజానగరం మండలంలోని నందరాడ జైశ్రీ బాలాజీ కి రాణా, వీరభద్ర కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌,  వజీర్‌ ఫ్యాన్సీ అండ్‌ జనరల్‌స్టోర్స్‌, పిల్లి శ్రీనివాసరావు కిరాణా స్టోర్స్‌లను తనిఖీచేసి ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు ఆయిల్‌ను అమ్మడం గుర్తించి కేసు నమోదు చేశారు. వెలుగుబందలోని పద్మావతి కిరాణా అండ్‌ జనరల్‌స్టోర్స్‌, నరేంద్రపురంలోని శ్రీనివాసా పాన్‌షాపు, చైతన్యగుప్త జనరల్‌స్టోర్స్‌ దుర్గాకిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, దేవీ కిరాణా, దివాన్‌చెరువులోని వెంకట్రావు కిరాణా, అండ్‌ కూల్‌ డ్రింక్‌ షాపులు తనిఖీ చేసి గోల్డ్‌డ్రాప్‌ సన్‌ఫ్లవర్‌, ఫ్రీడమ్‌ ఆయిల్‌ ఫ్యాకెట్లను ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మడం గుర్తించి కేసులు నమో దు చేశారు. రాజానగరంలోని శ్రీలక్ష్మీ  వేంకటేశ్వర కిరాణా, శ్రీలక్ష్మీ శ్రీనివాస జనరల్‌ స్టోర్స్‌, హౌసింగ్‌బోర్డు కాలనీలోని శ్రీరామ జనరల్‌ స్టోర్స్‌, రాజానగరం సాయి ఎంటర్‌ ప్రైజస్‌ను తనిఖీచేసి రైస్‌బ్రాన్‌ ఆయిల్‌, ఇడ్లీ రవ్వ, ఫ్రీడం ఆయిల్‌ ధరలలో తేడాలు ఉండడంతో కేసులు నమోదు చేశారు. కోరు కొండ మండలంలోని దోసకాయలపల్లిలోని శ్రీదేవి కిరాణా, శివదుర్గా ఫ్యాన్సీఅండ్‌ జనరల్‌స్టోర్స్‌ తనిఖీచేసి ఫ్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరలు తేడా ఉండడంతో కేసులు పెట్టారు. కడియం మం డలంలోని  వీరవెంకటదుర్గ జనల్‌ స్టోర్స్‌,  వేమగిరిలోని గోపీకృష్ణ కిరాణా స్టోర్స్‌ తనిఖీచేసి జీడిపప్పు ప్రి యగోల్డ్‌ ఆయిల్‌ ప్యాకెట్ల ధరలలో తేడాలు గ ుర్తిం చి కేసులు నమోదు చేశారు. సివిల్‌ సప్లయిస్‌, లీగల్‌ మెట్రాలజీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2022-03-23T06:15:10+05:30 IST