ధాన్యం సొమ్ముల కోసం ఆందోళన

ABN , First Publish Date - 2022-06-12T06:47:07+05:30 IST

కొత్తపేట మండలంలో వరి రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించలేదని, తొలకరి పంటకు ఎలా సమాయత్తం కావాలంటూ శనివారం మండలానికి చెందిన పది గ్రామాల రైతులు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.

ధాన్యం సొమ్ముల కోసం ఆందోళన

కొత్తపేట, జూన్‌ 11: కొత్తపేట మండలంలో వరి రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించలేదని, తొలకరి పంటకు ఎలా సమాయత్తం కావాలంటూ శనివారం మండలానికి చెందిన పది గ్రామాల రైతులు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మండలంలో వరి పండించే రైతులు సొంత పొలాలు  ఉన్నవారు కాదని, ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారన్నారు. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే మరో పంటకు ఎలా సమాయత్తమవుతామంటూ ప్రశ్నించారు. నాలుగు రోజుల్లో ధాన్యం సొమ్ములు రాకపోతే రెండో పంట వేసేది లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తహశీల్దార్‌ జి.డి.కిశోర్‌బాబుకు  వినతిపత్రం సమర్పించారు. సివిల్‌సప్లయిస్‌ అధికారులతో మాట్లాడి డబ్బులు  పడేలా చర్యలు తీసుకుంటామని  తహశీల్దార్‌   చెప్పారు..

Updated Date - 2022-06-12T06:47:07+05:30 IST