కోనసీమ జిల్లాగానే కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-02-23T06:24:50+05:30 IST

కోనసీమ అనే పదం అందరికీ ఆమోద యోగ్యమైనదని, ఆ పేరును ఎట్టి పరిస్థితుల్లోను మార్చవద్దంటూ కోనసీమ జిల్లా సాధన అఖిలపక్షం తరుపున మంగళవారం అమలాపురం ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడుకు వినతిపత్రం అందచేశారు.

కోనసీమ జిల్లాగానే కొనసాగించాలి

అమలాపురం టౌన్‌, ఫిబ్రవరి 22: కోనసీమ అనే పదం అందరికీ ఆమోద యోగ్యమైనదని, ఆ పేరును ఎట్టి పరిస్థితుల్లోను మార్చవద్దంటూ కోనసీమ జిల్లా సాధన అఖిలపక్షం తరుపున మంగళవారం అమలాపురం ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడుకు వినతిపత్రం అందచేశారు. కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. సాధన సమితి కన్వీనర్‌ మట్టపర్తి మురళీకృష్ణ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చిక్కాల గణేష్‌, కేఆర్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఆర్‌ సుబ్రహ్మణ్యం, వివిధ పార్టీల, సంఘాల ప్రతినిధులు సూదా గణపతి, కొండేటి ఈశ్వర్‌గౌడ్‌, చిట్టూరి పెదబాబు, కట్టోజు సన్నాయిదాసు, అప్పారి సూరిబాబు, గుత్తుల శ్రీను, గొవ్వాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.Read more