కోనసీమ జిల్లా ఆవిర్భావ వేడుకలు

ABN , First Publish Date - 2022-04-05T06:35:47+05:30 IST

కోనసీమ జిల్లా ఆవిర్భావ వేడుకలను సోమవారం గడియార స్తంభం సెంటర్‌లో నిర్వహించారు.

కోనసీమ జిల్లా ఆవిర్భావ వేడుకలు

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 4: కోనసీమ జిల్లా ఆవిర్భావ వేడుకలను సోమవారం గడియార స్తంభం సెంటర్‌లో నిర్వహించారు. కోనసీమ జేఏసీ చైర్మన్‌ వాసా ఎస్‌.దివాకర్‌, కన్వీనర్‌ బండారు రామ్మోహనరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు మంత్రి పినిపే విశ్వరూప్‌ ముఖ్య అతిథిగా హాజరై కేక్‌ కట్‌చేసి ముఖ్యమంత్రి జగన్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. నాయకులు చెల్లు బోయిన శ్రీనివాస్‌, సంసాని బులినాని, జేఏసీ ప్రతినిధులు కరాటం ప్రవీణ్‌, ఎస్‌ సంసోను, మంత్రిప్రగడ వేణుగోపాల్‌, గొవ్వాల రాజేష్‌  పాల్గొన్నారు.Read more