-
-
Home » Andhra Pradesh » East Godavari » kkd rmc medical studmets selected sports-NGTS-AndhraPradesh
-
హెల్త్‌యూనివర్శిటీ క్రీడా పోటీలకు ఆర్‌ఎంసీ విద్యార్థినులు
ABN , First Publish Date - 2022-08-17T06:02:10+05:30 IST
కాకినాడ స్పోర్ట్స్, ఆగస్టు 16: గన్నవరం సిద్దార్ధ మెడికల్ కళాశాలలో ఈనెల 18 నుంచి 20 వరకు జరిగే హెల్త్‌యూనివర్శిటీ మహిళా క్రీడాపోటీలకు ఆర్‌ఎంసీ విద్యార్థినులు 40 మంది ఎంపికయ్యారు. మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సింహం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దేవి మా

కాకినాడ స్పోర్ట్స్, ఆగస్టు 16: గన్నవరం సిద్దార్ధ మెడికల్ కళాశాలలో ఈనెల 18 నుంచి 20 వరకు జరిగే హెల్త్‌యూనివర్శిటీ మహిళా క్రీడాపోటీలకు ఆర్‌ఎంసీ విద్యార్థినులు 40 మంది ఎంపికయ్యారు. మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సింహం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దేవి మాధవి, ఆర్‌ఎంసీ పీడీ కె.స్పర్జన్‌రాజు క్రీడాకారిణులకు శుభాకాంక్షలు తెలిపారు. హెల్త్‌యూనివర్శిటీ పోటీల్లో రాణించి కళాశాలకు మంచిపేరు తేవాలని కోరారు. బుధవారం జట్టు గన్నవరం బయలుదేరి వెళ్తుందని పీడీ స్పర్జన్‌రాజు తెలిపారు.