అధికారులు సమన్వయంతో కృషి: ఆర్డీవో

ABN , First Publish Date - 2022-04-24T06:06:55+05:30 IST

సామర్లకోట, ఏప్రిల్‌ 23: పేదలందరికీ ఇళ్ల పనులు వేగవంతమయ్యేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ ఆర్డీవో బీవీ.రమణ సూచించారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ జితేంద్ర, మున్సిపల్‌ కమీషనర్‌ శేషాద్రి, హౌసింగ్‌ ఏఈఎల్‌ శ్రీనివాస్‌, క్షేత్ర

అధికారులు సమన్వయంతో కృషి: ఆర్డీవో

సామర్లకోట, ఏప్రిల్‌ 23: పేదలందరికీ ఇళ్ల పనులు వేగవంతమయ్యేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ ఆర్డీవో బీవీ.రమణ సూచించారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ జితేంద్ర, మున్సిపల్‌ కమీషనర్‌ శేషాద్రి, హౌసింగ్‌ ఏఈఎల్‌ శ్రీనివాస్‌, క్షేత్రస్థాయి సిబ్బందితో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. సామర్లకోట నూతన లేఅవుట్‌లో ఇసుక, సిమెంట్‌, ఐరన్‌, మెటీరియల్‌ కొరత లేకుండా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రత్యేకాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని నిర్మాణాలకు లబ్ధిదారులను సమాయత్తం చేయాలన్నారు. నూతన లేఅవుట్‌ నందు ప్రగతిని ఆర్డీవో పరిశీలించారు. 

Read more