పర్యావరణ పరిరక్షణకు క్లాత్‌ బ్యాగ్స్‌

ABN , First Publish Date - 2022-02-23T06:11:54+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), ఫిబ్రవరి 22: పర్యావరణ పరిరక్షణకు క్లాత్‌ బ్యాగ్స్‌ వాడాలని నగర మేయర్‌ సుంకర శివప్రసన్న కోరారు. నగరాన్ని ప్లాస్టిక్‌ రహితంగా రక్షించుకుందాం అనే నినాదంతో కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ ఆధ్వరంలో మంగళవారం పెద్ద మార్కెట్‌, రైతు బజార్‌లలో పర్యటించి ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజలకు అవగాహన కలిగించారు. ప్లాస్టిక్‌ కవర్లు వాడుతున్న వారికి కేఎంసీ పేరుతో ముద్రించిన క్లాత్‌ సంచులను

పర్యావరణ పరిరక్షణకు క్లాత్‌ బ్యాగ్స్‌
క్లాత్‌ సంచులను చూపుతూ అవగాహన కల్పిస్తున్న మేయర్‌, కమిషనర్‌

మేయర్‌ సుంకర శివప్రసన్న  

కార్పొరేషన్‌ (కాకినాడ), ఫిబ్రవరి 22: పర్యావరణ పరిరక్షణకు క్లాత్‌ బ్యాగ్స్‌ వాడాలని నగర మేయర్‌ సుంకర శివప్రసన్న కోరారు. నగరాన్ని ప్లాస్టిక్‌ రహితంగా రక్షించుకుందాం అనే నినాదంతో కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ ఆధ్వరంలో మంగళవారం పెద్ద మార్కెట్‌, రైతు బజార్‌లలో పర్యటించి ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజలకు అవగాహన కలిగించారు. ప్లాస్టిక్‌ కవర్లు వాడుతున్న వారికి కేఎంసీ పేరుతో ముద్రించిన క్లాత్‌ సంచులను పంపిణీ చేశారు. అనంతరం మేయర్‌, కమిషనర్‌ మాట్లాడుతూ మార్కెట్‌లకు వచ్చేటప్పుడు ఈ సంచులను తెచ్చుకోవాలని, ప్లాస్టిక్‌ సంచులు వాడకూడదని సూచించారు. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల మానవజీవితంలో పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.  కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, హెల్తాఫీసర్‌ డి.ఫృఽఽథ్వీచరణ్‌, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

Read more