కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలపై నిషేధం ఎత్తేయాలి

ABN , First Publish Date - 2022-02-16T05:49:11+05:30 IST

భానుగుడి (కాకినాడ), ఫిబ్రవరి 15: కలెక్టరేట్‌ వద్ద నిర్వహిస్తున్న ఆందోళనలపై నిషేధం ఎత్తివేయడంతో పాటు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలను మానుకోవాలని అఖిలపక్ష నాయకులు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. దీనిపై మంగళవారం

కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలపై నిషేధం ఎత్తేయాలి
కాకినాడలో కలెక్టర్‌ హరికిరణ్‌తో మాట్లాడుతున్న నాయకులు

అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులు

భానుగుడి (కాకినాడ), ఫిబ్రవరి 15: కలెక్టరేట్‌ వద్ద నిర్వహిస్తున్న ఆందోళనలపై నిషేధం ఎత్తివేయడంతో పాటు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలను మానుకోవాలని అఖిలపక్ష నాయకులు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. దీనిపై మంగళవారం కలెక్టరేట్‌కు వెళ్లిన వారు 5 గంటలకు పైగా నిరీక్షించి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబిరాణి, జిల్లా ఉపాఽధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జి, ఐఎ్‌ఫటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో గత 35ఏళ్లుగా కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలియజేసే సంప్రదాయం ఉందన్నారు. ఇప్పుడు కొత్తగా కలెక్టర్‌ హరికిరణ్‌ ఆందోళలను నిషేధిస్తూ ధర్నాచౌక్‌ పేరుతో నిర్మానుషప్రాంతంలో ఆందోళనలు చేసుకోమని చెప్పడం దారుణమన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును కాలరాయడమేనన్నారు. కలెక్టర్‌కు ఈ విషయాన్ని తెలియజేసేందుకు కలెక్టరేట్‌కు వెళితే అధికారులు సమయం ఇవ్వడం లేదని.. వైసీపీ కార్యకర్తలు, నాయకులకు గంటల తరబడి సమయం కేటాయిస్తున్నారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో చెక్కల రాజ్‌కుమార్‌, టి.రాజా, రమ ణి, తాళ్లూరి రాజు, పీఎస్‌నారాయణ, గుబ్బల ఆదినారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-16T05:49:11+05:30 IST