-
-
Home » Andhra Pradesh » East Godavari » kkd bhudaana yanjnam board works-NGTS-AndhraPradesh
-
భూదాన యజ్ఞం బోర్డు భూముల్లో పనుల అడ్డగింత
ABN , First Publish Date - 2022-02-23T06:13:41+05:30 IST
కార్పొరేషన్ (కాకినాడ), ఫిబ్రవరి 22: నగరంలో ప్రభుత్వ ఐటీఐ వెనుక గల భూదాన యజ్ఞం బోర్డు భూముల్లో అనధికారికంగా జరుగుతున్న పనులను మంగళవారం పాత పట్టాదారులు అడ్డుకున్నారు. దీంతో సంఘటనా స్థలం వద్ద వాగ్వివాదం జరిగింది. ఈ స్థలాలను గ్రావెల్‌తో ఎ

కార్పొరేషన్ (కాకినాడ), ఫిబ్రవరి 22: నగరంలో ప్రభుత్వ ఐటీఐ వెనుక గల భూదాన యజ్ఞం బోర్డు భూముల్లో అనధికారికంగా జరుగుతున్న పనులను మంగళవారం పాత పట్టాదారులు అడ్డుకున్నారు. దీంతో సంఘటనా స్థలం వద్ద వాగ్వివాదం జరిగింది. ఈ స్థలాలను గ్రావెల్‌తో ఎత్తు చేసి జేసీబీతో చదును చేస్తుండగా పాత పట్టాదారులు అడ్డంగా నిల్చుని నిరసన తెలిపారు. దీనిపై సంబంధిత డివిజన్ కార్పొరేటర్ కోరుమిల్లి బాలప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 80 అడుగుల రోడ్డు నిర్మాణంలో భాగంగా డ్రైన్ మూసేశారని ప్రజల నుంచి ఫిర్యాదు రావడంతో జేసీబీతో సరి చేయించామన్నారు. మాజీ ఎంపీటీసీ రాయుడు అనిల్ మాట్లాడుతూ భూదాన బోర్డులో పేద ప్రజల కోసం 2014లో 300 మందికి 60 గజాల చొప్పున పట్టాలు మంజూరు చేశారన్నారు. పట్టాదారులు సలాది రాధ మాట్లాడుతూ తమకిచ్చిన స్థలాలలో వేరొకరు పనులు చేయిస్తుండటంతో అడ్డుకున్నామన్నారు.