‘కాయల’ సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2022-05-30T06:41:19+05:30 IST

మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో గ్రామాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన దివంగత కాయల వెంకట్రావు సేవలు చిరస్మరణీయమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు ఉపాఽ ద్యక్షుడు బండారు సత్యానందరావు పేర్కొన్నారు.

‘కాయల’ సేవలు చిరస్మరణీయం

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు

ఆత్రేయపురం, మే 29: మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో గ్రామాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన దివంగత కాయల వెంకట్రావు సేవలు చిరస్మరణీయమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు ఉపాఽ ద్యక్షుడు  బండారు సత్యానందరావు  పేర్కొన్నారు. ఆదివారం లొల్ల గ్రామం లో కాయల వెంకట్రావు  విగ్రహావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మూడు పర్యాయాలు సర్పంచ్‌గా, రెండు పర్యాయాలు సొసైటీ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు సుస్థిరంగా నిలిచిపోతాయన్నారు. ఆయన కుమా రుడు, సర్పంచ్‌ కాయల జగన్నాథం తండ్రి ఆశయాలను నెరవేర్చి గ్రామాభి వృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో  టీడీపీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు, వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు కరుటూరి నరసింహారావు, తోటకూర సుబ్బరాజు, మాజీ జడ్పీటీసీ ధరణాల రామకృష్ణ, మక్కవెల్లి శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.Read more