కార్తీకానికి వీడ్కోలు

ABN , First Publish Date - 2022-11-25T00:54:58+05:30 IST

జిల్లా వ్యాప్తంగా పోలిపౌఢ్యమి పూజలు ఘనంగా నిర్వ హించారు. కార్తీక మాసంలో 30 రోజులు పూజలు నిర్వహించి గురువారం వీడ్యోలు పలికారు.

కార్తీకానికి  వీడ్కోలు

భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు

ప్రత్తిపాడు, నవంబరు 24: జిల్లా వ్యాప్తంగా పోలిపౌఢ్యమి పూజలు ఘనంగా నిర్వ హించారు. కార్తీక మాసంలో 30 రోజులు పూజలు నిర్వహించి గురువారం వీడ్యోలు పలికారు. మండలంలో గురువారం కార్తీకమాసానికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలి కారు. ప్రత్తిపాడు, ధర్మవరం, రాచపల్లి, ఒమ్మంగి, ఉత్తరకంచి, గజ్జెన పూడి, తదితర గ్రామాల్లోని శివాలయాల్లో పూజలు నిర్వహించి కార్తీకదీపాలను ఆలయ చెరువుల్లోను, కాలువల్లో వదిలారు. ప్రత్తిపాడు పుష్కర ఘాట్‌వద్ద దేవతామూర్తుల విగ్రహాలకు పూజలుచేసి పుష్కర కాలువలో కార్తీకదీపాలు వదిలి కార్తీకానికి వీడ్కోలు పలికారు. రాచపల్లి గ్రామంలో గురువారం మార్గశిర మాసం ప్రారంభం, పోలిపాడ్యమి సందర్భంగా గురువారం గంగాలమ్మ ఉత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే పర్వత ప్ర సాద్‌, మండల ఉపాధ్యక్షుడు ఏనుగు శ్రీనివాస్‌, సర్పంచ్‌ సారిపల్లి లోవ లక్ష్మిగంగరాజు, ఆలయ కమిటీ పెద్దలు గంగాలమ్మకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 6వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు.

సామర్లకోట: కార్తీకమాస పర్వదినాలు ముగింపు పురష్కరించుకుని సామర్లకో టలో పలు ఆలయాలలోనూ, గోదావరి పుష్కరిణిలలోనూ గురువారం తెల్లవారు జామున భక్తులు విశేష పూజలు నిర్వహించారు. పోలమ్మకు గోదావరి జలాలలో అరటిడొప్పలపై ఒత్తులు వెలిగించి విడిచిపెట్టడం ద్వారా పోలమ్మకు, కార్తీక మాసానికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పితృదేవతల అత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ బ్రాహ్మణులకు దానాలు చేశారు. కుమార రామ భీమేశ్వ రాలయం, మాండవ్యనారాయణ స్వామి అలయం, హరిహరక్షేత్రం అన్నపూర్ణాస మేత రామలింగేశ్వరాలయంలోనూ, జగదీశ్వరి ఆలయంలోనూ, చౌడేశ్వర సమేత రామ లింగేశ్వరాలయంలోనూ ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొన్నారు.

జఠాఝూట అలంకరణకు భారీ లడ్డూలు

సామర్లకోట కుమారరామ భీమేశ్వరాలయంలో గురువారం సాయంత్రం జరిగిన జఠాఝూట అలంకరణ పూజలకు సామర్లకోట నీలిమ హోటల్‌ అధినేత అమలకంటి శ్రీనివాసరావు తదితర కుటుంబసభ్యుల సౌజన్యంతో 60 కిలోల రెండు భారీ లడ్డూలను నివేదించారు.

గొల్లప్రోలు రూరల్‌: గొల్లప్రోలు పట్టణం, మండలంలోని దుర్గాడ, చేబ్రోలు శివాలయాలు, తాటిపర్తిలోని అపర్ణా సమేత నాగేశ్వరస్వామి ఆలయాలు గురువారం భక్తులతో కిటకిటలాడాయి. పాడ్యమి దీపాలు వెలిగించి పూజలు చేశారు. దుర్గాడలోని పంచాయతన సమేత ఉమారామలింగేశ్వరస్వామిని విశేషంగా అలంకరించారు.

గండేపల్లి: కార్తీక మాసం ఆఖరిరోజు మండలంలో ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. భక్తులు తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేసి చెరువుల్లో ను, కాలువల్లోను కార్తీక దీపాలు వదిలారు. మల్లేపల్లి గ్రామంలో ఈ వేడుకలు కన్నుల పండవగా సాగా యి. సుమారు 100 మంది మహిళా భక్తులు అఖండ దీపాలు తలపై పెట్టుకుని కోలాట నృత్యాల నడుమ, తీన్మార్‌ భాజా భజంత్రీలతో స్వామి వారిని పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్లారు.

జగ్గంపేట: కార్తీకమాసం చివరిరోజున పోలిస్వర్గం ఘనంగా జరిగింది. మహిళలు గురువారం అధిక సంఖ్యలో కాల్వల వద్దకు చేరుకుని దీపాలు వదిలారు. గుర్రం పాలెంలో కార్తీకమాసం చివరిరోజు పోలిస్వర్గం ఘనంగా నిర్వహించారు. లక్ష్మిదేవి స్వరూం అయినటువంటి గోమాతను పూజిస్తూ హారతులు ఇచ్చారు. మహిళలు 54 మందితో ఘనంగా అమ్మవారికి ఇష్టమైన పసుపు, ఎరుపు రంగుల కలయికలతో వస్త్రధారణతో అకర్షణగా నిలస్తూ ఊరు మొత్తం తిరిగారు.

తొండంగి: ఆలయాలవద్ద గురువారం పోలి పాడ్యమి సందర్భంగా పెద్ద ఎత్తున మహిళా భక్తులు తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించారు. ఏ కొత్తపల్లి కదంబ క్షేత్రంలో తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీక దీపాలను చెరువులో వదిలారు.

పిఠాపురం: పిఠాపురం పట్టణంలో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో సహస్ర దీపారాధన గురువారం వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులతో ఆలయం చుట్టూ ప్రదిక్షణ చేశారు. ఆలయ అర్చకుడు పి.విజయజనార్థనాచార్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించగా ఈవో సీహెచ్‌వీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

న తెలిపారు.

Updated Date - 2022-11-25T00:54:58+05:30 IST

Read more