కాపులకు ద్రోహం చేసిన సీఎం జగన్‌

ABN , First Publish Date - 2022-09-21T06:27:29+05:30 IST

సీఎం జగన్‌ కాపు సామాజిక వర్గానికి తీరని ద్రోహం చేస్తున్నారని టీడీ పీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యర్రా వేణుగోపాలరాయుడు మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు.

కాపులకు ద్రోహం చేసిన సీఎం జగన్‌

టీడీపీ నేత యర్రా వేణు 

రాజమహేంద్రవరం సిటీ, సెప్లెంబరు 20: సీఎం జగన్‌ కాపు సామాజిక వర్గానికి తీరని ద్రోహం చేస్తున్నారని టీడీ పీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యర్రా వేణుగోపాలరాయుడు మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు.  కాపు, బలిజ, ఒంటరి, తెలగ, కులాలకు రిజర్వేషన్‌ కల్పిస్తామని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  రెండుసార్లు మ్యానిఫెస్టోలో హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. పదే పదే కాపులకు మేలు చేశామని గొప్పలకు పోతున్న సీఎం జగన్‌పై వైసీపీలో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెలేలు, ఎమ్మెల్సీలు తిరగబడాలన్నారు. కాపు సామాజిక వర్గంపై వైసీపీలో కాపులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆపేసిన పోరాటాన్ని కొనసాగించాలన్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేక కాపు విద్యార్థులు పడుతున్న బాధలు వైసీపీలో కాపు నాయకులకు కనిపించడంలేదన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.3100 కోట్లు నిధులు కాపులు సంక్షేమానికి ఖర్చుచేశారని గుర్తుచేశారు. జగన్‌ అధికారంలోకి రాగానే కాపుల సంక్షేమాన్ని, రిజర్వేషన్లు ఎత్తివేసారన్నారు. కాపు నేస్తం పేరుతో మోసం చేశారన్నారు. కాపులంతా సీఎం జగన్‌కు పార్టీలోని కాపులకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.Read more