విజయేంద్ర సరస్వతికి ఘన స్వాగతం

ABN , First Publish Date - 2022-07-07T05:54:13+05:30 IST

పెద్దాపురం, జూలై 6: కంచి జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామికి బుధవారం పట్టణంలో ఘన స్వాగతం పలికారు. సామర్లకోట నుంచి ఆయన భారీ ఊరేగింపుతో మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ శిష్య, భక్త బృందంతో పట్టణానికి విచ్చేశారు. మున్సిపల్‌

విజయేంద్ర సరస్వతికి ఘన స్వాగతం

పెద్దాపురం, జూలై 6: కంచి జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామికి బుధవారం పట్టణంలో ఘన స్వాగతం పలికారు. సామర్లకోట నుంచి ఆయన భారీ ఊరేగింపుతో మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ శిష్య, భక్త బృందంతో పట్టణానికి విచ్చేశారు. మున్సిపల్‌ సెంటర్‌ వద్ద స్వామికి లలితా ఇండస్ట్రీస్‌ అధినేతలు మట్టే శ్రీనివాస్‌, సత్యప్రసాద్‌ సోదరులు పలువురు ప్రముఖులతో కలిసి స్వా మికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మెయిన్‌ రోడ్డుమీదుగా స్వామి కన్యకా పరమేశ్వరీ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం విడిది గృహానికి చేరుకున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీమంగతాయారు, వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌ పాల్గొన్నారు.

Read more