‘కాకినాడ రూరల్‌ అభివృద్ధికి కృషి’

ABN , First Publish Date - 2022-08-15T05:47:22+05:30 IST

కరప, ఆగస్టు 14: కాకినాడ రూరల్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కరపతోపాటు వలసపాకల, వేములవాడ, పెదకొత్తూరు గ్రామాల్లో పర్యటించి ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పెనుగుదురులో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిం

‘కాకినాడ రూరల్‌ అభివృద్ధికి కృషి’

కరప, ఆగస్టు 14: కాకినాడ రూరల్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కరపతోపాటు వలసపాకల, వేములవాడ, పెదకొత్తూరు గ్రామాల్లో పర్యటించి ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పెనుగుదురులో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మిసత్తిబాబు, జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, వైస్‌ఎంపీపీ పాట్నీడి సత్యభీమేశ్వరరావు, వైసీపీ మండలాధ్యక్షుడు చింతా ఈశ్వరరావు, సర్పంచ్‌లు సాదే ఆశాజ్యోతికుమార్‌, రెడ్డిపల్లి వెంకటమాధవిరమేష్‌, కమిడి మంగాదేవి, చింతా నాగలక్ష్మి, వాసంశెట్టి రామారావు, నక్కా సత్తిబాబు, ఎంపీడీవో స్వప్న, ఈవోపీఆర్డీ పి.శ్రీనివాసరావు, కార్యదర్శులు వి.సునీల్‌, పి.వీరభద్రరావు పాల్గొన్నారు.

Read more