‘ప్రజల చెంతకే పాలన’

ABN , First Publish Date - 2022-11-23T23:58:43+05:30 IST

తమ ప్రభుత్వం పలు విప్లవాత్మకమైన చర్యలతో ప్రజల చెంతకే పాలన తీసుకొచ్చిందని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. పెనుగుదురులో బుధవారం ఆయన నిర్మాణంలో

‘ప్రజల చెంతకే పాలన’

కరప, నవంబరు 23: తమ ప్రభుత్వం పలు విప్లవాత్మకమైన చర్యలతో ప్రజల చెంతకే పాలన తీసుకొచ్చిందని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. పెనుగుదురులో బుధవారం ఆయన నిర్మాణంలో ఉన్న గ్రామసచివాలయ భవనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. వైఎస్సార్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్‌లైన్‌, స్థంబాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చాలని విద్యుత్‌శాఖ ఏఈ సానా ఈశ్వరప్రసాద్‌ను ఆదేశించారు. జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, సర్పంచ్‌ రెడ్డిపల్లి వెంకటమాధవిరమేష్‌, నాయకులు పెంకే సత్తిబాబు, నాగిరెడ్డి ఏసుబాబు, బండారు సతీష్‌, తుమ్మలపల్లి శ్రీనివాస్‌, కొమ్మోజు శ్రీనివాస్‌, తుమ్మలపల్లి విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:59:29+05:30 IST

Read more