భూసేకరణకు ప్రణాళికాయుత చర్యలు: జేసీ

ABN , First Publish Date - 2022-09-17T05:36:26+05:30 IST

కాకినాడ సిటీ, సెప్టెంబరు 16: జిల్లాలో మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్‌ఎంపీఎ్‌ఫసీ, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌(బీఎంఎసీయు), ఆటోమోటిక్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ (ఏఎంసీయు), డిజిటల్‌ లైబ్రరీ, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం తదితర భవనాలకు అవసరమైన భూసేకరణకు ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలని జేసీ ఎస్‌.ఇలాక్కియ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆమె ప్రభుత్వ భవనాలు, నవరత్నాలు

భూసేకరణకు ప్రణాళికాయుత చర్యలు: జేసీ

కాకినాడ సిటీ, సెప్టెంబరు 16: జిల్లాలో మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్‌ఎంపీఎ్‌ఫసీ, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌(బీఎంఎసీయు), ఆటోమోటిక్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ (ఏఎంసీయు), డిజిటల్‌ లైబ్రరీ, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం తదితర భవనాలకు అవసరమైన భూసేకరణకు ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలని జేసీ ఎస్‌.ఇలాక్కియ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆమె ప్రభుత్వ భవనాలు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకానికి అవసరమైన భూసేకరణపై రెవెన్యూ, మున్సిపల్‌, మార్కెటింగ్‌, పశుసంవర్ధక, సహకార, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఎంపీఎ్‌ఫసీ, బీఎ ంసీయు, ఏఎంసీయు, డిజిటల్‌ లైబ్రరీ, చెత్తనుంచి సంపద సృష్టి కేంద్రం(ఎ్‌సడబ్ల్యూపీసీ)లకు అవసరమైన భూమిని గుర్తించి నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం నిమిత్తం అందించే నివేశన స్థలాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలని జేసీ ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీఽధర్‌రెడ్డి, కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌  కె.రమేష్‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, పశుసంవర్ధకశాఖ జేడీ సూర్యప్రకాశరావు, మార్కెటింగ్‌ ఏడీ నాగేశ్వరరావు, కాకినాడ, పెద్దాపురం డివిజన్‌ ఆర్‌డీవోలు బీవీ రమణ, జె.సీతారామారావు పాల్గొన్నారు.

Read more