-
-
Home » Andhra Pradesh » East Godavari » kakinada dalitha ikyavedika leaders-NGTS-AndhraPradesh
-
దాడులను ప్రతిఘటించేలా ఉద్యమాలు
ABN , First Publish Date - 2022-07-18T05:51:52+05:30 IST
భానుగుడి (కాకినాడ), జూలై 17: కారంచేడు దళితులపై నరమేధం జరిగి 37ఏళ్లు పూర్తయినా దళితులపై దాడులు నేటికీ సాగుతున్నాయని, ఇకపై దాడులను ప్రతిఘటించేలా దళిత, వామ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని ఐక్యవేదిక పిలుపునిచ్చింది. కారం

భానుగుడి (కాకినాడ), జూలై 17: కారంచేడు దళితులపై నరమేధం జరిగి 37ఏళ్లు పూర్తయినా దళితులపై దాడులు నేటికీ సాగుతున్నాయని, ఇకపై దాడులను ప్రతిఘటించేలా దళిత, వామ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని ఐక్యవేదిక పిలుపునిచ్చింది. కారంచేడు కాకినాడ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, జె.వెంకటేశ్వర్లు, ఏనుగుపల్లి కృష్ణ, పిట్టా వరప్రసాద్ మాట్లాడుతూ రిజర్వేషన్లు, ఉద్యోగాలు దళితులకు తాత్కాలికంగా ఉపశమనాలుగా ఉపయోగపడ్డాయే గానీ భూమిపై హక్కు, సంపదపై హక్కు రానంతకాలం దళితుల జీవితాల్లో మార్పురాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాశి బాలయ్య, కాకిలేటి రవీందర్, సుబ్బారావు, అప్పారావు, బంగారు సత్యనారాయణ పాల్గొన్నారు.