పారిశుధ్య వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-29T06:07:26+05:30 IST

కార్పొరేషన్‌, సెప్టెంబరు 28: ప్రజలతో ముడిపడి ఉన్న పారిశుధ్య వ్యవస్థపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ నగరపాలక సంస్థ ప్రత్యే కాధికారిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా బుధవారం కలెక్టరేట్‌లో మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరపాలక సంస్థ సాధారణ విషయాలు, పరిపాలన విభా గం అధికా

పారిశుధ్య వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి: కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కృతికా శుక్లా

కార్పొరేషన్‌, సెప్టెంబరు 28: ప్రజలతో ముడిపడి ఉన్న పారిశుధ్య వ్యవస్థపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ నగరపాలక సంస్థ ప్రత్యే కాధికారిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా బుధవారం కలెక్టరేట్‌లో మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరపాలక సంస్థ సాధారణ విషయాలు, పరిపాలన విభా గం అధికారులు విధులు, పలు అంశాలతో పాటు ఇప్పటి వ రకు ఆయా విభాగాల వారీగా చేపట్టిన పనులు, వాటి పురోగతిని సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నా రు. పట్టణ ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారినపడకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, డిప్యూటీ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌, సెక్రటరీ ఎం.యేసుబాబు, ఎస్‌ఈ సత్యకుమారి, ఎంహెచ్‌వో డి.పృధ్వీచరణ్‌, టీపీఆర్వో ఎం.కృష్ణమోహన్‌, మేనేజర్‌ కె.సత్యనారాయణ, పర్యావరణ ఇంజనీర్‌ ఎంవీకే మాధవి, శిరీష, హరిదాస్‌ పాల్గొన్నారు.


Read more