-
-
Home » Andhra Pradesh » East Godavari » kakinada collcter kruthika shukla meeting-NGTS-AndhraPradesh
-
నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేలా కృషి
ABN , First Publish Date - 2022-09-10T06:20:23+05:30 IST
కాకినాడ సిటీ, సెప్టెంబరు 9: రాష్ట్రప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణ పనుల్లో నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేసేలా కృషి చేయాలని కలెక్టర్ కృతికాశుక్లా ఆదేశించారు. హౌసింగ్, శాశ్వత భవన నిరర్మాణ పనుల పురోగతిపై కాకినాడ, పెద్దాపురం డివిజన్ పరిధిలోని మండలాలవారీగా కలెక్టరేట్‌లో శుక్రవారం ఆమె స

కాకినాడ సిటీ, సెప్టెంబరు 9: రాష్ట్రప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణ పనుల్లో నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేసేలా కృషి చేయాలని కలెక్టర్ కృతికాశుక్లా ఆదేశించారు. హౌసింగ్, శాశ్వత భవన నిరర్మాణ పనుల పురోగతిపై కాకినాడ, పెద్దాపురం డివిజన్ పరిధిలోని మండలాలవారీగా కలెక్టరేట్‌లో శుక్రవారం ఆమె సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ పనులు ముమ్మరం చేసేలా క్షేత్రస్థాయి అఽధికారులు ప్రణాళికయుత చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారులను ప్లాట్లతో మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 340 పీఆర్ బిల్డింగ్‌లు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్మాణం, మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, డీపీవో ఎస్‌వీ నాగేశ్వరనాయక్, డ్వామీ పీడీ ఎ.వెంకటలక్ష్మి, కాకినాడ, పెద్దాపురం డీఎల్‌డీవోలు తదితరులు ఉన్నారు.