కాకవాడ బాలికల పాఠశాల ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-13T01:06:49+05:30 IST

కాకవాడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల లైంగిక వేధింపుల ఘటనలో బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన సంఘాలు సోమవారం రంపచోడవరం ఐటీడీఏను ముట్టడించి గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను నిలదీశాయి.

కాకవాడ బాలికల పాఠశాల ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి

రంపచోడవరం, డిసెంబరు 12: కాకవాడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల లైంగిక వేధింపుల ఘటనలో బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన సంఘాలు సోమవారం రంపచోడవరం ఐటీడీఏను ముట్టడించి గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను నిలదీశాయి. కాకవాడ పాఠశాల ప్రధా నోపాధ్యాయురాలి భర్తే ఈ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన వెలుగు చూసిన వెంటనే అధికారపార్టీ ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవోలు స్వయంగా పాఠశా లను పరిశీలించి జోక్యం చేసుకున్నా ఐటీడీఏ, పోలీసులు తూతూమంత్రంగా చర్యలు చేపట్టడం శోచనీయమని గిరిజన సంఘం నాయకుడు లోతా రామా రావు, విద్యాక మిటీ చైర్మన్‌ కుర్ల రాజశేఖరరెడ్డి ఆరోపించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన బాలికలపై ఆయా ఉపాధ్యాయులు, ప్రధానో పాధ్యాయులు, ఇతర సిబ్బంది ఎటువంటి వేధింపులకు పాల్పడిన తక్షణం చర్యలు తీసుకొనే విధానాలను ఇప్పటి ఐటీడీఏ అధికారులు విస్మరించిన వైనం మునుపెన్నడూ జరగలేదు. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే సూచనలకే విలువలేని పరిస్థితి మన్యంలో చోటుచేసుకుంది. పోలీసులు కూడా బాధిత బాలికలు, వారి తల్లిదండ్రుల ఆవేదనకు విలువ ఇవ్వకుండా ఈ ఘటనకు బాధ్యులైన వారిని కాపాడే ప్రయత్నాలు సాగిస్తున్నారని గిరిజన సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ ఘటనపై గిరిజన సంక్షేమాధికారులు, పోలీసు అధికా రుల తీరుపై ఎస్టీ కమిఫన్‌కు, బాలల హక్కుల కమిషన్‌కు, ఇతర ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేస్తున్నామని గిరిజన సంఘ నాయకులు స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-13T01:06:51+05:30 IST