క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ప్రతి రైతుకు అందాలి

ABN , First Publish Date - 2022-11-25T01:49:36+05:30 IST

క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ప్రతి రైతుకు వ్యక్తిగతంలో అందాల్సిన అవసరం ఉందని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. మండలంలోని ధర్మవరంలో 12ఎకరాల కౌలుభూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేపట్టిన వరి పంట దిగుబడులకు రాగా గురువారం పంట నూర్పిడి యంత్రానికి కొబ్బరికాయ కొట్టి కోత, నూర్పిడి పనులు ఆయన ప్రారంభించారు.

క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ప్రతి రైతుకు అందాలి
ధర్మవరంలో దిగుబడికి వచ్చిన వరికంకులను పరిశీలిస్తున్న జేడీ లక్ష్మీనారాయణ

  • వచ్చే ఖరీఫ్‌లో బ్లాక్‌ రైస్‌నే పండిస్తా: జేడీ లక్ష్మీనారాయణ

  • ధర్మవరం ప్రకృతి వ్యవసాయక్షేత్రంలో వరికోతలు, నూర్పిడి పనులు ప్రారంభం

ప్రత్తిపాడు, నవంబరు 24: క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ప్రతి రైతుకు వ్యక్తిగతంలో అందాల్సిన అవసరం ఉందని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. మండలంలోని ధర్మవరంలో 12ఎకరాల కౌలుభూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేపట్టిన వరి పంట దిగుబడులకు రాగా గురువారం పంట నూర్పిడి యంత్రానికి కొబ్బరికాయ కొట్టి కోత, నూర్పిడి పనులు ఆయన ప్రారంభించారు. నూర్పిడి యంత్రాన్ని స్వయంగా నడిపి పనులు పూర్తయ్యే వరకు ఆయన పొలం వద్దే గడిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ఒక గ్రామానికి, ఒక మండలానికి యూనిట్‌గా కాకుండా నష్టపోయిన పంటకు రైతుకు వ్యక్తిగతంగా మంజూరు చేయాలన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ సాగు విధానాలు కూడా మారాలన్నారు. వ్యవసాయ రంగంలో యువత, విద్యావంతులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గతేడాది కంటే ఈ ఏడాది తమ కౌలుపొలంలో పంట దిగుబడులు పెరిగాయన్నారు. గతేడాది జీవామృ తంతోనే పంట సాగు చేపట్టగా ఈ ఏడాది దానితోపాటు కషాయాలను డ్రోన్‌ కెమెరాతో పిచి కారీ చేయించామన్నారు. ఈ రెండేళ్లలోని అనుభవాలతో వచ్చే ఖరీఫ్‌లో కొత్తగా సాగు పద్ధతు లు అవలంబించనున్నట్లు తెలిపారు. రాబోయే ఖరీఫ్‌లో పూర్తిగా తమ ప్రకృతి వ్యవసాయ క్షే త్రంలో బ్లాక్‌ రైసే పండించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌ పంట సాగు పూర్తయిన నేప థ్యంలో రబీలో జీలుగు సాగు చేపట్టనున్నట్లు వివరించారు. ధర్మవరం సొసైటీ అధ్యక్షుడు చెక్కపల్లి సత్తిబాబు, పొలం రైతు ఇందుకూరి మురళీకృష్ణంరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T01:49:36+05:30 IST

Read more