స్వామీజీ పర్యటనకు ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2022-11-30T01:22:24+05:30 IST

గంగలకుర్రులో డిసెంబరు 10 నుంచి 15వ తేదీ వరకు కంచికామకోటి పీఠాధిపతి శ్రీవిజయేంద్రసరస్వతి స్వామీజీ పర్యటించనున్నారు.

 స్వామీజీ పర్యటనకు ఏర్పాట్లు చేయాలి

అంబాజీపేట, నవంబరు 29: గంగలకుర్రులో డిసెంబరు 10 నుంచి 15వ తేదీ వరకు కంచికామకోటి పీఠాధిపతి శ్రీవిజయేంద్రసరస్వతి స్వామీజీ పర్యటించనున్నారు. పర్యట నకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా సూచించారు. గంగలకుర్రు జయంతి భాస్కరసుబ్రహ్మణ్యం నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వామీజీ పర్యటనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఎం.ముక్కంటి, డీఎస్పీ ఎం.వెంకటరమణకు సూచించారు. డీపీవో పి.కృష్ణకుమారి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎన్‌.వి.కృష్ణారెడ్డి, డ్వామా పీడీ ఎస్‌.మధుసూధనరావు, డీఈలు వి.చంద్రశేఖర్‌,ఎ.పద్మనాభం, ఆర్‌అండ్‌బీ జేఈ జి.రాజేంద్ర, సర్పంచ్‌ కాండ్రేగుల శ్రీనివాసరావు, ఆర్డీసీ డీఎం సీహెచ్‌.సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T01:22:24+05:30 IST

Read more