-
-
Home » Andhra Pradesh » East Godavari » janasena manohar visit yv palem-NGTS-AndhraPradesh
-
ఖనిజ సంపదను దోచుకుంటున్నారు
ABN , First Publish Date - 2022-02-19T05:44:13+05:30 IST
గోదావరి నదీ తీర ప్రాంతంలో అధికార పార్టీ అండదండలతో కోట్లాది రూపాయల ఖనిజ సంపదను దోచుకుంటున్నారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. మట్టి, ఇసుక దోపిడీపై పార్టీ ఉద్యమానికి సిద్ధంగా ఉందన్నారు.

జనసేన నేత నాదెండ్ల మనోహర్
పి.గన్నవరం,
ఫిబ్రవరి 18: గోదావరి నదీ తీర ప్రాంతంలో అధికార పార్టీ అండదండలతో కోట్లాది
రూపాయల ఖనిజ సంపదను దోచుకుంటున్నారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్
నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. మట్టి, ఇసుక దోపిడీపై పార్టీ ఉద్యమానికి
సిద్ధంగా ఉందన్నారు. వె.ౖవి.పాలెం గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు.
సర్పంచ్ యర్రంశెట్టి త్రివేణి ఆధ్వర్యంలో స్థానిక మహిళలు నిర్వహిస్తున్న
ఆందోళన శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. తాగునీరు తదితర సమస్యలను
మహిళలు మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. రాత్రి, పగలు మట్టి లారీలు
రాకపోకలు సాగించడంతో వై.వి.పాలెం వంతెన శిథిలమైందని, వంతెన కూలిపోతే
స్థానిక రైతుల వ్యవసాయ ఉత్పత్తులు తరలించడానికి, శ్మశానవాటికకు వెళ్లడానికి
దారి ఉండదని వివరించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ సమస్యలపై జిల్లా
అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కలెక్టర్కు
వినతిపత్రం అందిస్తారని, అప్పటికి స్పందించకపోతే జనసేన ఆధ్వర్యంలో ఉద్యమబాట
పడదామన్నారు. ఎస్ఐ ప్రసాద్, ఆర్ఐ జి.సుబ్రహ్మణ్యం అక్కడకు చేరుకుని
వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసన
విరమించారు.
ఎమ్మెల్యే ఎక్కడున్నారో తెలియదు:
గ్రామంలో సర్పంచ్,
ఎంపీటీసీ కూడా జనసేన పార్టీయే కైవసం చేసుకోవడంతో నాయకులు, అధికారులు
పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఎమ్మెల్యే తమ గ్రామం ఎప్పుడు రారని, సమస్యలు పట్టించుకోరని వివరించారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యుడు పంతం నానాజీ,
ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, బండారు శ్రీనివాసరావు, శిరిగినీడి
వెంకటేశ్వరరావు, వాసంశెట్టి కుమార్, సాధనాల శ్రీనివాసరావు, దొమ్మేటి
సాయికృష్ణ, ఆదిమూలం సూరయ్యకాపు, కొమ్మూరి మల్లిబాబు, యడ్ల ఏసు
పాల్గొన్నారు.