-
-
Home » Andhra Pradesh » East Godavari » inter result-NGTS-AndhraPradesh
-
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల
ABN , First Publish Date - 2022-08-31T06:36:40+05:30 IST
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు.

ప్రథమ సంవత్సర ఫలితాల్లో 8వ స్థానం
కాకినాడ రూరల్, ఆగస్టు 30: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 18,519 మంది విద్యార్థులు హాజరుకాగా 5,786 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 31శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 15,819మంది విద్యార్థులు హాజరుకాగా 4,290మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 33 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ప్రకారం ఏపీలో తూర్పుగోదావరి జిల్లా 11వ స్థానంలోను, ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాల ఉత్తీర్ణతశాతంలో 8వ స్థానంలోనూ నిలవడం గమనార్హం.