దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత కాంగ్రెస్‌దే: రుద్రరాజు

ABN , First Publish Date - 2022-08-15T06:39:06+05:30 IST

స్వాతంత్రోద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత కాంగ్రెస్‌దే: రుద్రరాజు

అమలాపురం టౌన్‌, ఆగస్టు 14: స్వాతంత్రోద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. 75జ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా అమలాపురం పార్లమెంటు ఇన్‌చార్జి, పీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్‌ ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర చేపట్టారు. తొలుత వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు గడియార స్తంభం సెంటర్‌ వద్దకు చేరుకుని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ గౌరవ పాదయాత్రను రుద్రరాజు ప్రారంభించారు. నాయకులు చీకట్ల అబ్బాయి. అయితాబత్తుల సుభాషిణి, కామన ప్రభాకరరావు, కుడుపూడి శ్రీనివాస్‌, వంటెద్ద బాబి, నిమ్మకాయల ప్రసాద్‌, దామిశెట్టి జయ, ముషిణి రామకృష్ణారావు, దేవరపల్లి రాజేంద్రబాబు, యార్లగడ్డ రవీంద్ర, షకీలా, దోనిపాటి విజయలక్ష్మి, ఈతకోట సోమరాజు, రాయుడు రమణ, జోగి అర్జునరావు పాల్గొన్నారు. 


Read more