దేశంలోనే అతిపెద్ద యువజన సంఘం ఎన్‌సీసీ

ABN , First Publish Date - 2022-11-21T02:08:02+05:30 IST

భారతదేశంలోనే అతిపెద్ద యువజన సంఘం ఎన్‌సీసీ అని కాకినాడ గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ ఏకే రుషి అన్నారు.

దేశంలోనే అతిపెద్ద యువజన సంఘం ఎన్‌సీసీ

దివాన్‌చెరువు, నవంబరు 20: భారతదేశంలోనే అతిపెద్ద యువజన సంఘం ఎన్‌సీసీ అని కాకినాడ గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ ఏకే రుషి అన్నారు. ఎన్‌సీసీ గ్రూప్‌ కాకినాడ ఆధ్వర్యంలో ఎన్‌సీసీ మొట్టమొదటి అల్యూమిని, ఏఎన్‌వోల సమావేశం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలోని కన్వెన్షన్‌ సెంటర్‌ భవనంలో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ రుషి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్‌సీసీ విద్యార్థి వివిధరంగాల్లో వారి కెరీర్‌లో ఎదగడానికి సహాయపడు తుందని చెప్పారు. ఎన్‌సీసీ అంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానమన్నారు. అహం, ఆత్మస్థైర్యం మధ్య వ్యత్యాసాలను వివ రించారు. గైట్‌ అటానమస్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌వీఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ ఎన్‌సీసీ శిబిరాలను శాశ్వతంగా నిర్వహించడానికి, రేంజిఫైరింగ్‌కు తమ కళాశాల యాజమాన్యం సుముఖంగా ఉందని వివరించారు. తూర్పుగోదావరి నుంచి కృష్ణా వరకూ 7 జిల్లాల నుంచి హాజరైన అన్ని యూనిట్ల ఏఎన్‌వోలు తమ విజయాల పట్ల సంక్షిప్త ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమంలో 18వ బెటాలియన్‌ కమాండింగ్‌ అధికారి కల్నల్‌ బీడీ సావన్‌ గౌడర్‌, అడ్మిన్‌ అధికారి లెఫ్టినెంట్‌ కల్నల్‌ వరుణ్‌ భారతీయ, సుబేదార్‌ మేజర్‌ జి.గోవిందరావు, దాదాపు 500 మంది పూర్వవిద్యార్థులు, 150 మంది ఏఎన్‌వోలు, 100 మంది పీఐ సిబ్బంది పాల్గొన్నారు.

ని ద

Updated Date - 2022-11-21T02:08:02+05:30 IST

Read more