12 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-28T05:48:49+05:30 IST

జిల్లాలో ఇప్పటి వరకు 12 వేల మంది ఇంటి నిర్మాణాలు పూర్తిచేసినట్టు కలెక్టర్‌ చెప్పా రు.

12 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి : కలెక్టర్‌
మ్యాప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

రాజానగరం, సెప్టెంబరు 27 : జిల్లాలో ఇప్పటి వరకు 12 వేల మంది ఇంటి నిర్మాణాలు పూర్తిచేసినట్టు కలెక్టర్‌ చెప్పా రు. జిల్లాలో 60 వేల మంది జగనన్న ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా 51 వేల మందికి మంజూరు ఉత్తర్వులు అందజేశా మన్నారు.మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వం సేకరించిన జగనన్న కాలనీలను మంగళవారం ఆమె పరిశీలించారు.  జిల్లాలో వెలుగుబంద లేఅవుట్‌లో అత్యధికంగా ఇళ్ల స్థలాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 90 రోజులు కార్యక్రమంలో భాగంగా అర్హులైన పేదలు ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే వారికి ఉచితంగా స్థలం అందిస్తామన్నారు. వివిధ దశల్లో ఉన్న ఇంటి నిర్మాణాలను మరింత వేగవంతం చేసే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఎమ్మెల్యే జక్కం పూడి రాజా మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో సుమారు 20 వేల మందికి ఎన్‌పీఐలో భాగంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, ఆర్డీవో ఎ.చైత్రవర్షిణి, అడిషనల్‌ కమిషనర్‌ సత్యవేణి, హౌసింగ్‌ ఈఈ జి.సోములు, తహశీల్దార్‌ పవన్‌ కుమార్‌, డీఈలు, ఏఈలు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. =


Updated Date - 2022-09-28T05:48:49+05:30 IST