గృహ నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-04-10T06:32:42+05:30 IST

జగనన్న గృహనిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా సూచించారు.

గృహ నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి

ముమ్మిడివ రం, ఏప్రిల్‌ 9: జగనన్న గృహనిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని  కలెక్టర్‌ హిమాన్షుశుక్లా సూచించారు. అయి నాపురంలో శనివారం జగనన్న కాలనీ నిర్మాణ పనులను ఆ యన అధికారులతో కలిసి పరిశీలించారు. కోనసీమ జిల్లాలో గృహనిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసు కుంటున్నామన్నారు. నిర్మాణదశలో ఎన్ని గృహాలు ఉన్నాయి, వాటిలో బేస్‌మెంట్‌ లెవెల్‌, లింటల్‌ లెవెల్‌, పూర్తయిన గృహాలు, ఇంకా నిర్మాణం చేపట్టాల్సిన గృహాలకు సంబంధించి ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముమ్మిడివరంలోని ఎయిమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన కోనసీమ జిల్లా అధికారుల కార్యాలయాలను ఆర్డీవో ఎన్‌.వసంతరాయుడుతో కలిసి పరిశీలించారు. అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని  అధికారులకు సూచనలిచ్చారు.


Read more