భీమేశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2022-08-31T07:00:09+05:30 IST

పంచారామక్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని మంగళవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి. శ్రీసుధా కుటుంబ సమేతంగా సందర్శించారు.

భీమేశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి
న్యాయమూర్తి దంపతులకు స్వామివారి ప్రసాదం అందజేస్తున్న ఈవో

ద్రాక్షారామ, ఆగస్టు 30: పంచారామక్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని మంగళవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి. శ్రీసుధా కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భీమేశ్వరస్వామివారిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం న్యాయమూర్తి దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో పి.తారకేశ్వరరావు స్వామివారి ప్రసాదం, చిత్రపటాలను న్యాయమూర్తి దంపతులకు అందజేశారు. 

Read more