జయాపజయాలను ఒకేలా స్వీకరిస్తా

ABN , First Publish Date - 2022-09-19T06:27:17+05:30 IST

అలనాటి నటుడు ఎన్టీఆర్‌, చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి వంటి నాయకులే ప్రజల్లోకి వెళ్లాలంటే పాదయాత్ర చేసి విజయం సాధిం చారని, ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు చేరవేయాల నే ఉద్దేశ్యంతో కాకినాడ నగరంలో పాదయాత్ర చేపట్టా మని హీరో నాగశౌర్య తెలిపారు.

జయాపజయాలను ఒకేలా స్వీకరిస్తా
అభిమానితో సెల్ఫీ దిగుతున్న సినీ హీరో నాగశౌర్య

  • మంచి సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే పాదయాత్ర: హీరో నాగశౌర్య
  • కాకినాడ నగరంలో కృష్ణ వ్రింద విహారి టీం సందడి

కాకినాడ కల్చరల్‌, సెప్టెంబరు 18: అలనాటి నటుడు ఎన్టీఆర్‌, చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి వంటి నాయకులే ప్రజల్లోకి వెళ్లాలంటే పాదయాత్ర చేసి విజయం సాధిం చారని, ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు చేరవేయాల నే ఉద్దేశ్యంతో కాకినాడ నగరంలో పాదయాత్ర చేపట్టా మని హీరో నాగశౌర్య తెలిపారు. కాకినాడలో ఆదివారం కృష్ణ వ్రింద విహారి సినిమా సందడి చేసింది. నగరంలో భానుగుడి సెంటర్‌నుంచి జగన్నాథపురం వంతెన వర కు హీరో నాగశౌర్య పాదయాత్ర చేశారు. అనంతరం అభిమానులు ఆయన్ను గజమాలతో ఘనంగా సత్కరిం చారు. ప్రజలు ఆయన్ను చూసేందుకు ఆసక్తి చూపిం చారు. యువత సెల్ఫీల కోసం ఎగబడగా అందరికీ సెల్ఫీలు ఇస్తూ తన పాదయాత్రను ముగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న ఆలోచన అందరికీ ఉంటుందని, ఇందులో భాగంగానే తిరుపతినుంచి వైజాగ్‌ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర నిర్వహిస్తూ వచ్చామని తెలిపారు. అడుగడుగునా ప్రేక్షకులు, ప్రజల అభిమానం మర్చిపోలేనిదని, ఈ పాదయాత్ర చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఈనెల 23న సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉందని, ప్రేక్షకులు విజయాన్ని అందించినా, అపజయాన్ని ఇచ్చినా రెండింటినీ ఒకలాగే స్వీకరిస్తానన్నారు. కొత్తగా ప్రయోగాలు చేస్తూ ఎప్పటికీ మంచి సినిమాలను అందించేందుకు తాను ప్రయత్నిస్తుంటానన్నారు. కార్యక్రమంలో హీరోయిన్‌ సిర్లి సేతియ, చిత్ర బృందం పాల్గొన్నారు.

Read more