దంచి కొట్టింది

ABN , First Publish Date - 2022-06-07T07:01:10+05:30 IST

ఉన్నట్టుండి ఒక్కసారిగా కారుమబ్బులు.. ఉదయం ఏడుకి అర్ధంతరంగా చీకటి.. ఇంతలో భారీ ఈదురుగాలులు... భయ పెట్టేలా పిడుగు శబ్ధాలు.. కుండపోత వాన. సోమవారం జిల్లావ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిగా వర్షం కురవడంతో జిల్లా తడిచి ముద్దయింది.

దంచి కొట్టింది
గొల్లప్రోలు పట్టణంలోని శివాలయం ప్రాంగణమంతా వర్షపునీరు చేరిన దృశ్యం

  • జిల్లావ్యాప్తంగా భారీగా కురిసిన వర్షాలు
  • గాలులకు ఎక్కడికక్కడ విరిగిన చెట్లు.. రహదారులు, పాఠశాలలు ధ్వంసం
  • ఇళ్లు, ఆలయాల్లోకి వర్షపు నీటితో ఇక్కట్లు
  • దుర్గాడలో ఎగిరిన 20ఇళ్ల పైకప్పులు
  • గొల్లప్రోలులో శివాలయంలోకి నీళ్లు
  • భారీగా నేలకూలిన పామాయిల్‌ చెట్లు
  • జిల్లావ్యాప్తంగా నేలకొరిగిన ఏడు ట్రాన్మ్‌ఫార్మర్లు, 43 విద్యుత్‌ స్తంభాలు 
  • అనేక మండలాల్లో విద్యుత్‌ సరఫరా బంద్‌
  • అరటి, జీడి, మామిడి, పామాయిల్‌ తోటలతోపాటు వరి పంటకూ నష్టం
  • కాకినాడ నగరంలో నీటమునిగిన రహదారులు

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

ఉన్నట్టుండి ఒక్కసారిగా కారుమబ్బులు.. ఉదయం ఏడుకి అర్ధంతరంగా చీకటి.. ఇంతలో భారీ ఈదురుగాలులు... భయ పెట్టేలా పిడుగు శబ్ధాలు.. కుండపోత వాన. సోమవారం జిల్లావ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిగా వర్షం కురవడంతో జిల్లా తడిచి ముద్దయింది. కొన్నిరోజులుగా విపరీతమైన ఎండలతో జనం అల్లాడారు. ఇంటినుంచి బయటకు రావడానికే జంకారు. దీనికితోడు తీవ్రమైన ఉక్కపోతతో నరకయాతన పడ్డారు. రుతుపవనాల ఆగమనం ప్రభావంతో ఒక్కసారిగా సోమవారం వాతావర ణం చల్లబడిపోయింది. ఊహించని రీతిలో భారీగా ఈదురు గాలులతోపాటు కుండపోతగా వాన పడింది. దీంతో దాదాపు అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాకి నాడ, తుని, కిర్లంపూడి, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు,పిఠాపురం, ఏలేశ్వరం తదితర ప్రాంతాల్లో భారీవర్షాలు కురిశాయి. తుని లో అయితే కొన్నిగంటలపాటు పిడుగుల శబ్ధాలు భయ పెట్టాయి. దీనికితోడు ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ కాకినాడతోసహా అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు పూర్తి గా నీటమునిగాయి. కాకినాడ మెయిన్‌రోడ్డు చెరువులా మా రింది. అటు గొల్లప్రోలులో వర్షం బీభత్సం సృష్టించింది. ఎక్కడికక్కడ అనేక రహదారు లపై చెట్లు పడిపోయాయి. తీవ్రమైన గాలు లకు దుర్గాడలో ఇరవైకిపైగా ఇళ్లపైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో ఇంట్లో ఉన్న సా మాన్లన్నీ తడిచిపోవడంతో బాధితులు లబో దిబోమన్నారు. ఇదే ప్రాంతంలో 15 వరకు పలు స్తంభాలు నేలకొరిగాయి. గొల్లప్రోలు శివాలయంలోకి ఏకంగా వర్షపునీరు భారీగా వచ్చి చేరింది. చేబ్రోలులో హైస్కూల్‌ ప్రహా రీపైగా భారీ వృక్షం నేలకొరగడంతో గుడి ధ్వంసమైంది. మండలంలో వందలాది పా మాయిల్‌ తోటలుండగా, చెట్లు చాలావరకు నేలకొరిగాయి. కిర్లంపూడి, ఏలేశ్వరం, కాకినా డ రూరల్‌, జగ్గంపేట, తుని, కోటనందూరు, రౌతుల పూడిలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. అనేక రహదారులు పూర్తిగా మునిగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

నేలకొరిగిన ట్రాన్స్‌ఫార్మర్లు

కాగా జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతకు మొత్తం ఏడు వి ద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు నేల కొరిగాయి. పిఠాపు రంలో 5, కాకినాడరూరల్‌లో 2 ట్రాన్స్‌ఫార్మ ర్లు పడిపోయాయి. పలు మండలాల్లో 11కేవీ విద్యుత్‌ స్తంభాలు 12, ఎల్‌టీపోల్స్‌ 31 పడి పోయాయి. దీంతో సోమ వారం సాయంత్రం వరకు వీటిని తిరిగి నిలబెట్టలేదు. ఈదురు గాలుల తీవ్రతకు అనేక మండలాల్లో సా యంత్రం వరకు విద్యుత్‌ నిలిచిపోయింది. కాగా సోమవారం ఉదయం నుంచి సాయం త్రం వరకు కాకినాడ రూరల్‌లో 11.2 సెంటీ మీటర్లు, యు.కొత్తపల్లి 9, తాళ్లరేవు 8.8, కాకినాడ 6.5, తుని 5.7,పెదపూడి 5.4, కాజు లూరు 5.1, పిఠాపురం 3.7, కోటనందూరు 3 చొప్పున వర్షపాతం నమోదైంది. మరోపక్క తీవ్రమైన ఈదు రుగాలులకు ఏలేశ్వరం, ప్రత్తిపాడు, జగ్గంపేట, కిర్లంపూడి, తుని, కాకినాడ రూరల్‌ తదితర మండలాల్లో అరటిచెట్లు నే లకూలాయి. మామిడి, జీడి, పామాయిల్‌ తోటలతోపాటు వరి చేలల్లోకి నీళ్లు చేరడంతో పంట నష్టం వాటిల్లింది. మరో పక్క గడచిన కొన్నివారాలుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ లకు దాటిపోయింది. ఇంటినుంచి బయటకు రావాలంటే నే వడగాడ్పులు భయపెట్టాయి. అటు ఉక్కపోత నరకం చూ పించింది. ఈతరుణంలో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడడంతో జిల్లా సోమవారం చల్లబడింది. చల్లని వాతావర ణంతో ఎక్కడికక్కడ జనం ఉపశమనం పొందారు.

Updated Date - 2022-06-07T07:01:10+05:30 IST