ఉత్సాహంగా విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలు
ABN , First Publish Date - 2022-11-30T01:18:01+05:30 IST
ప్రతిఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ అన్నారు.

కాకినాడ అర్బన్, నవంబరు 29: ప్రతిఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ అన్నారు. కాకినాడలోని జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ మైదానంలో విభిన్న ప్రతిభావంతుల జిల్లాస్థాయి ఆటల పోటీలను మంగళవారం ఆమె ప్రారంభించారు. వచ్చేనెల 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. రన్నింగ్, షాట్‌పుట్, డిస్క్ త్రో, త్రోబాల్, సాఫ్ట్‌బాల్ తదితర విభాగాల్లో 550మంది పాల్గొన్నారని ఆ శాఖ ఏడీ వాడ్రేవు కామరాజు తెలిపారు. కుడా చైర్‌పర్సన్ రాగినీడి చంద్రకళాదీప్తి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్‌రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
డు శివ, అత్త ఏసమ్మలు ఆరోపిస్తున్నారు. కాగా పోలీసులు అనుమా
Read more