-
-
Home » Andhra Pradesh » East Godavari » gurukulam went road-NGTS-AndhraPradesh
-
గురుకులానికి వెళ్లే రహదారికి మోక్షమెప్పుడు?
ABN , First Publish Date - 2022-09-11T06:52:28+05:30 IST
గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉండే నరేంద్రపురం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులు పాఠశాల రహదారికి గత కొన్ని సంవత్సరాలుగా మోక్షం రావడంలేదు.

పి.గన్నవరం, సెప్టెంబరు 10: గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉండే నరేంద్రపురం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులు పాఠశాల రహదారికి గత కొన్ని సంవత్సరాలుగా మోక్షం రావడంలేదు. దీంతో నెలకు ఒకసారి రెండవ శనివారం తమ పిల్లలను చూసుకోవడానికి వస్తున్న ఆ విద్యార్థుల తల్లిదండ్రుల బాధలు వర్ణానాతీతం. ఈ శనివారం ఒకపక్క వర్షం మరోపక్క రహదారులు, పాఠశాల పరిసరాలు అధ్వానంతో వారు నానా అవస్థలు పడ్డారు. తమ పిల్లలతో సరదాగా గడపడానికి వస్తే పాఠశాల వాతావరణం అంతా చిత్తడిగా మారడంతో వెంటనే వెనుతిరిగామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారిలో ప్రయాణం ప్రమాదకరంగా ఉందని, ద్విచక్ర వాహనంపై వెళుతుంటే జారిపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర వాహనాలపై వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధాన రహదారి నుంచి పాఠశాల వరకు నడిచి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆవేదన చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నామని, కనీసం రహదారులు లేకపోవడంతో తమ పిల్లలతో గడపడానికి ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. పాఠశాల ఆవరణ చిత్తడితో నెలకు ఒకసారి వస్తున్న తమకే ఇంత ఇబ్బందిగా ఉంటే, రోజూ తమ పిల్లలు ఎంత భాధపడుతున్నారో అంటూ వారు ఆందోళన వ్యక్తంచేశారు. 503 మంది విద్యార్థులు ఉండే గురుకుల పాఠశాల రహదారికి ఇటివలే లక్షలు హెచ్చించి జడ్పీ నిధులతో మరమ్మతులు చేశారు. అయితే మళ్లీ రహదారి యఽథాస్ధితికి చేరుకుందని పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు వెళ్లే రహదారితోపాటు పాఠశాల ఆవరణలో తగిన సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.