గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీకి చర్యలు

ABN , First Publish Date - 2022-09-08T06:54:06+05:30 IST

జిల్లాలో గురుకుల పాఠశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల సమన్వయకర్త ఎ.మురళీకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీకి చర్యలు

 పోర్టుసిటీ (కాకినాడ), సెప్టెంబర్‌ 7: జిల్లాలో గురుకుల పాఠశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల సమన్వయకర్త ఎ.మురళీకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని లక్ష్మీనరసాపురంలో బాలుర కోసం 5వ తరగతి-18, 6వ తరగతి-3, 7వ - 2, 8వ -2 సీట్లు, ధవళేశ్వరంలో బాలికలకు 5వ తరగతి -2, వీరలంక పల్లిలో బాలికలకు 5వ తరగతి -24, 6వ -9, 7వ -1, 8వ - 9, 9వ -9 సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. కాకినాడలోని సాంబమూర్తినగర్‌లో బాలికలకు 5వ తరగతి -36, 6వ-8, 7వ-3, 8వ-4, 9వ-4 సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. వెలమ కొత్తూరు తునిలో బాలికలకు 6వ-3, 8వ-2, 9వ-1  సీట్లు ఖాళీలు, జగ్గంపేటలో బాలికలకు 5వ తరగతి-9, 6వ-4, 7వ -3, 8వ - 1, 9వ -1సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. చొల్లంగిపేటలో బాలికలకు 5వ తరగతి-36, 6వ-17,  7వ-7 8వ-10 సీట్లు ఖాళీలు, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో బాలికలకు 5వ తరగతిలో 17, రాజోలులో బాలికలకు 5వ తరగతిలో 37, 6వ-4,  సీట్లు ఉన్నాయని, గోడిలో బాలికలకు 5వ తరగతిలో 23, 6వ -7, 7వ-1, 8వ తరగతిలో-6, గోడిలో బాలురకు 5వ తరగతిలో 36, 6వ -2, 7వ-17, 8వ-2, 9వ తరగతిలో-17 సీట్లు ఖాళీలు ఉన్నాయి. పి.గన్నవరంలో బాలురకు 5వ తరగతిలో 26, ద్రాక్షరామలో బాలురకు 5వ తరగతిలో 5, తుని బాలురకు 5వ తరగతిలో 7 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2021-22లో నాలుగో తరగతిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారన్నారు. డీసీ కార్యాలయాన్ని కానీ, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లనుగానీ ఈనెల 10వ తేదీలోపు ముందుగానే కలిసి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గురుకుల కళాశాలల్లో
సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్‌ ఇంటర్మీ డియట్‌ మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని  జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల కో-ఆర్డినేటర్‌ ఎ.మురళీ కృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని లక్ష్మీనరసాపురంలో బాలురకు ఎంఈసీ- 32, ధవళేశ్వరం బాలికల కళాశాలలో ఎంపీసీ-1, వీరలంకపల్లి బాలికల కళాశాలల్లో ఎంపీసీ-22 సీట్లు ఖాళీలు ఉన్నాయని, కాకినాడ జిల్లాలోని సాంబమూర్తినగర్‌ బాలికల కళాశాలల్లో ఎంపీసీ -18, ఏలేశ్వరం బాలికల కళాశాలల్లో ఎంపీసీ-3, వెలమ కొత్తూరు తుని బాలికల కళాశాలలో ఎంఈసీ-40, సీఈసీ-4, పిఠాపురం బాలికల కళాశాలలో ఎంపీసీ-1 అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రాజోలులో బాలికలకు ఎంపీసీలో-12, గోడి బాలురకు ఎంపీసీలో-20, ద్రాక్షారామలో బాలురకు ఎంపీసీలో-13, పి.గన్నవరం బాలురకు సీఈసీ-20, ఎంఈసీ-35 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సీలో వచ్చిన మార్కులు, వారి ప్రతిభ ఆధారంగా సీటు కేటాయిస్తామని, డీసీ కార్యాలయానికి గానీ, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను గానీ ఈనెల 10వ తేదీలోపు కలిసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2022-09-08T06:54:06+05:30 IST