-
-
Home » Andhra Pradesh » East Godavari » grand marriage fare-NGTS-AndhraPradesh
-
వైభవంగా నరసింహస్వామి కల్యాణోత్సవాలు
ABN , First Publish Date - 2022-03-16T05:53:34+05:30 IST
కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం వేలాది మంది భక్తులు వచ్చి కొండపైన, దిగువన లక్ష్మీనరసింహస్వామి వార్లను దర్శించుకున్నారు.

కోరుకొండ, మార్చి 15: కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం వేలాది మంది భక్తులు వచ్చి కొండపైన, దిగువన లక్ష్మీనరసింహస్వామి వార్లను దర్శించుకున్నారు. కొండ ఎక్కలేని భక్తులు దిగువన స్వామి వారి పాదాల వద్ద కొబ్బరికాయలు, పానకం నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఆరాధనలు, నివేదనలు, సేవాకాలం నిర్వహించారు. స్వామి వారిని జడ్పీటీసీ కర్రి నాగేశ్వరరావు, ఎంపీటీసీ వుల్లి సూర్యకుమారి, సర్పంచ్ కర్రి లక్ష్మీసరోజ, వైస్ ఎంపీపీ బొరుసు సుబ్బలక్ష్మి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు, జిల్లా అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ శార దా సతీష్ దర్శించుకున్నారు. కాగా కల్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు స్ధానిక విరియాల వెంకటరెడ్డి పంతుల ధర్మసత్రంలో ఉదయం, సాయంత్రం నిత్యా న్నదాన కార్యక్రమాన్ని దేవదాయ ధర్మాదాయ శాఖ నిర్వహిస్తోంది.