గౌతమీ గ్రంథాలయానికి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-02-17T05:13:56+05:30 IST

రాజమహేంద్రవరం గౌతమీ గ్రంథాలయానికి హైదరాబాద్‌కు చెందిన ఫుడ్‌ 4 థాట్‌ ఫౌండేషన్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డును అందజేసింది.

గౌతమీ గ్రంథాలయానికి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు
లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుతో గ్రంథాలయాధికారి వెంకటరావు, సిబ్బంది

  రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 16: రాజమహేంద్రవరం గౌతమీ గ్రంథాలయానికి హైదరాబాద్‌కు చెందిన ఫుడ్‌ 4 థాట్‌ ఫౌండేషన్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డును అందజేసింది. దేశంలోని పాఠకులకు ఉత్తమ సేవలందించిన గ్రంథాలయాలను గుర్తించి, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా ఈ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డును అందజేస్తారు. 2022 ఏడాదికి గాను గౌతమీ గ్రంథాలయాన్ని ఎంపిక చేసి దానికి గుర్తింపుగా ఇండియా రీడింగ్‌ ఒలింపియాడ్‌ రోల్‌ మోడల్‌ మెమెంటో ఇచ్చినట్టు గ్రంథాలయాధికారి ఆర్‌సీహెచ్‌ వెంకటరావు తెలిపారు. అవార్డు రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఫౌండేషన్‌ వారికి ధన్యవాదాలు తెలిపారు.

Read more